జాతీయ వార్తలు

కల్తీ కూటములతో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడాలన్న ప్రాంతీయ పార్టీల ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రామ్‌మనోహర్ లోహియా సోషలిస్టు సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ అనైతిక రాజకీయాలకు పాల్పడడం దిగజారుడు తనమేని శనివారం ఇక్కడ నిప్పులు చెరిగారు. రామ్ మనోహర్ లోహియా 109వ జయంతి సందర్భంగా ప్రాంతీయ పార్టీలపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఈనాడు కొన్ని పార్టీలు డాక్టర్ లోహియా అనుచరులమని చెప్పుకుంటున్నాయి. అది పూర్తి అవకాశం వాదం. ఆయన పేరుచెప్పి పుట్టుకొస్తున్నవన్నీ కల్తీ కూటములే’ అని ప్రధాని ధ్వజమెత్తారు. ఎవరైతే (లోహియా) కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారో ఆ పార్టీతోనే పొత్తులకు వెంపర్లాడడం సిగుచేటు, గర్హనీయం అని ఆయన అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ సెక్యులర్, రాష్ట్రీయ జనతాదళ్, శరద్ యాదవ్ పార్టీ లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పార్టీలు లోక్‌సభ ఎన్నికల తరువాత ఆర్జేడీలో కలసిపోతాయని మోదీ జోస్యం చెప్పారు. ఇలాంటి కూటములతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రామ్‌మనోహర్ లోహియా దేశం గర్వించదగ్గ నేత అంటూ ప్రధాని శ్లాఘించారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆయన బాటలోనే నడుస్తోందని ఆయన తెలిపారు. ‘డాక్టర్ లోహియా ఆలోచనలో మాకు స్ఫూర్తి. వ్యవసాయం రంగం ఆధునీకరణ, రైతుల సాధికారిత కోసం లోహియా అహరహం కృషి చేశారు...కలలుగన్నారు’ అని ప్రధాని స్పష్టం చేశారు. లోహియా కలల సాకారానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆయన బాటలోనే తాము నడుస్తున్నామని మోదీ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కృషి సంచాయ్ యోజన, ఈ-నామ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ లాంటి ఎన్నో పథకాలు రైతుల కోసం తీసుకొచ్చామని ఆయన ట్వీట్ చేశారు. సమాజంలో కులాలు, లింగ వివక్ష, సామాజిక న్యాయం కోసం లోహియా ఎన్నో పోరాటలు చేశారన్న ప్రధాని ‘ మా ప్రభుత్వం కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తోంది’అని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ రద్దుచేసి చారిత్రక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రామ్‌మనోహర్ లోహియా గురించి మాట్లాడితే కాంగ్రెస్ భయంతో వణికిపోతుందని మోదీ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందని, పారిశ్రామికాభివృద్ధి ఊసేలేదని ఆయన నిప్పులు చెరిగారు. సైన్యాన్ని ఆధునీకరించలేదని ఆయన విమర్శించారు. దేశ భద్రత వారికి పట్టదని ప్రధాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘అధికారం కబ్జాచేయడంలో నేర్పరులు. ఎంత దక్కితే అంత లూటీ చేయడం. పక్కవాళ్లను దోచుకోవడంలో నిష్ణాతులు’ కూటమి నేతలకను ఉద్దేశించి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హయాంలో నేరగాళ్లు, అసాంఘిక శక్తులకు రెక్కలొస్తాయని, పేదలు, గిరిజనులు, దళితులు, ఓబీసీలు, మహిళను భద్రత ఉండదని మోదీ తెలిపారు. ‘ఇప్పుడు లోహియా సిద్ధాంతాల పేరుతో మోసం చేస్తారు.. రేపుయావత్‌దేశ ప్రజలనే దోచుకుంటారు ’అని ప్రధాని ట్వీట్ చేశారు.