జాతీయ వార్తలు

దక్షిణాది నుంచి పోటీ చేయాలా.. వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయినాడ్ లేదా మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ అక్కడే విజయం సాధించి తమ సత్తా చూపించటం మంచిది.. దీనికోసం మొత్తం పార్టీ యంత్రాంగమంతా కృషి చేయాలని ఒక వర్గం వాదిస్తుంటే.. రెండో వర్గం మాత్రం రాహుల్ అమేథీతోపాటు వాయినాడ్ లేదా మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలని రెండో వర్గం వాదిస్తోంది. అమేథీలో ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఆయన మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయటం మంచిదనే వాదన వినిపిస్తోంది. అమేథీతోపాటు దక్షిణాదిలోని కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని ఏదో ఒక లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీకి చెందిన ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది. గతంలో ఇందిరా గాంధీ 1980లో రాయబరేలీ నుండి ఓడిపోయిన తరువాత ఎన్నికల్లో ఆమె రాయబరేలీతోపాటు అవిభక్త ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ నుండి పోటీ చేయగా సోనియా గాంధీ 1999లో రాయబరేలీతోపాటు కర్నాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రెండు నియోజకవర్గాల నుండి వారు పోటీ చేశారని కాంగ్రెస్‌లోని ఒక వర్గం వాదిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి 1957లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, బల్‌రాంపూర్, మాథురా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయలేదా? ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గుజరాత్‌లోని వదోదరతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గం నుండి పోటీ చేశారని వారంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ అమేథీతోపాటు కర్నాటకలోని వాయినాడ్ లోక్‌సభ నియజకవర్గం నుండి పోటీ చేయటంలో ఎలాంటి తప్పులేదని వారంటున్నారు. అమేథీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎస్పీ, బీఎస్పీతో పొత్తు కుదరని ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ కేవలం అమేథీపై ఆధారపడటం ఎంతమాత్రం క్షేమం కాదన్నది వారి వాదన. అమేథీతోపాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలీలో ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులను దించితే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గత ఐదేళ్ల నుండి అమేథీలో పెద్దఎత్తున పని చేస్తున్నారు.. అమె ప్రతి గ్రామానికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కేవలం అమేథీపై మాత్రమే ఆధారపడితే ప్రమాదమన్నది ఒక వర్గం వాదన. అమేథీతోపాటు దక్షిణాదిలోని మరో లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేస్తే కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా దెబ్బతింటుందని మరో వర్గంవారు వాదిస్తున్నారు. రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్ నుండి పోటీ చేయనున్నట్లు కేరళ నుండి వార్తలు రాగానే ‘‘్భగ్ రాహుల్ భాగ్ (పారిపో రాహుల్ పారిపో)’’ అంటూ చేసిన ట్వీట్ బహుళ ప్రచారం పొందింది. అమేథీలో విజయం సాధించలేమనే భయంతోనే రాహుల్ వాయినాడ్ నుండి కూడా పోటీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల రాహుల్‌తోపాటు కాంగ్రెస్ ప్రతిష్ఠకు కూడా తీరని నష్టం వాటిల్లుతుందని వారు వాదిస్తున్నారు. రాహుల్ అమేథీ నుండి మాత్రమే పోటీచేసి విజయం సాధించటం ద్వారా సత్తాను చాటుకోవాలన్నది వారి అభిప్రాయం. అయితే దక్షిణాది నుంచి పోటీచేయాలా వద్దా అనే అంశంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదులేదు. సోమవారం జరగవలసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందా లేదా అనేది కూడా స్పష్టం కావటం లేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది.