జాతీయ వార్తలు

అన్ని స్థానాలూ మావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, మార్చి 24: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 21 ఎంపీ స్థానాలనూ గెల్చుకుని కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని బీజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంతటి మెజారిటీ ఏ పార్టీకి రాదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. నయాఘర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 21 ఎంపీ స్థానాలనూ తమ పార్టీ గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి తగిన విధంగా బుద్ధి చెప్పి, మన పట్ల చూపిన వివక్షకు అంతం పలకాల్సిన అవకాశం ప్రజలకు వచ్చిందని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిసా అసెంబ్లీకి సైతం ఇక్కడ నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు 20ని బీజేడీ గెల్చుకోగా, 147 అసెంబ్లీ స్థానాలకు 117 స్థానాల్లో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఒడిసాకు ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ తీరా అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించి, రాష్ట్రానికి మొండి చేయి చూపారని నవీన్ పట్నాయక్ విమర్శించారు. తమకే కనుక ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించి ఉండేదని ఆయన అన్నారు. తమ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వచ్చేవని, మరిన్ని నిధులు వచ్చి ఉండేవని ఆయన పేర్కొన్నారు. తమ రాష్ట్రం నుంచి రైల్వేకు ప్రతి ఏడాది 20 వేల కోట్ల ఆదాయం వస్తున్నా, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రైలుమార్గాలను వేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఏమాత్రం ఆదాయం లేని పలు రాష్ట్రాల్లో అనేక రైలు ప్రాజెక్టులను కేటాయించిన కేంద్రం తమపై మటుకు పూర్తి వివక్ష చూపిందని అన్నారు. ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు కేంద్రం ఏమి చెబితే దానికి తల ఊపుతు ఆడతారే తప్ప స్థానిక సమస్యలపై నోరు విప్పరని ఆయన ధ్వజమెత్తారు. అయితే ప్రజలే తమ అధిష్టానంగా బీజేడీ భావిస్తోందని, తమ రిమోట్ కంట్రోల్ ఇక్కడి 4.5 కోట్ల ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. అందుకే తాము ఒడిసా ప్రయోజనాలను కాపాడటానికి, దాని అభివృద్ధికే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 33 శాతం ఎంపీ సీట్లను మహిళలకే కేటాయించి మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని నిరూపించామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన కాలియా పథకం ద్వారా 25 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ పథకంపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎంతమాత్రం నమ్మవద్దని ఈ పథకం కింద ఏ ఒక్క రైతు పేరును తొలగించలేదని ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.