జాతీయ వార్తలు

నిన్న చాయ్‌వాలా.. నేడు చౌకీదార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకప్పుడు తరచూ ఊతపదంగా వాడే ‘చాయ్‌వాలా’ను మరచిపోయారని, ఇపుడు ‘చౌకీదార్’గా తనను తాను అభివర్ణించుకుంటున్నారని, ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ విమర్శించారు. ‘నేనూ చౌకీదారుడినే’ అంటూ ప్రధాని మోదీ గత కొన్నిరోజులుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఊదరగొడుతూ ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై జరిగిన వైమానిక దాడులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అదే సమయంలో గతంలో గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఉరీ, బారాముల్లా, పుల్వామా ఘటనల్లో జరిగిన టెర్రిరిస్టుల దాడుల తర్వాత ఈ చౌకీదారు (కాపలాదారు) ఎందుకు నిద్రపోయారని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభల్లో తాను దేశానికి చౌకీదారుడినని, తనలాగే అంతా చౌకీదారులుగా మారాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) అని ప్రత్యక్ష దాడికి దిగుతోంది. ఈ సందర్భంగా కపిల్ సిబాల్ మాట్లాడుతూ ‘ఇపుడు చాయ్‌వాలాల గురించి మరచిపోయారు..కొత్తగా చౌకీదారులను గుర్తు చేస్తున్నారు. మళ్లీ మరోసారి ఈ చౌకీదారులను కూడా మరచిపోతారు’ అని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలలో నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’ పేరిట బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు చేరువైందని, అప్పటి కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఉపయోగించిన ‘చాయ్‌వాలా’ అనే ఊతపదానే్న మోదీ చాయ్‌వాలాగా తనను తాను అభివర్ణించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రస్తుత ఎన్నికల్లో విస్తృత ప్రచారంలో వాడుకుంటున్న ‘నేను కూడా చౌకీదారుడినే’ అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) అని దుయ్యబట్టిన సందర్భాలను కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తున్న విషయాన్ని ఆయన పేర్కొన్నారు. అమర జవాన్ల త్యాగాలతోపాటు బాలాకోట్‌లో జరిగిన వైమానిక దాడులను సైతం బీజేపీ ప్రచారాంశాలుగా ఉపయోగించుకోవడానికి కపిల్ సిబాల్ తీవ్రంగా దుయ్యబట్టారు. మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్య, ఆరోగ్యం, పేదరికం, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కున్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారిని ఎందుకు పట్టుకోలేకపోతోందని ఆయన ప్రశ్నించారు.

చిత్రం.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్