జాతీయ వార్తలు

2025 నాటికి క్షయ రహిత భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: దేశాన్ని 2025 నాటికి క్షయ వ్యాధి లేని దేశంగా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఆయన వరుస ట్వీట్లు చేస్తూ క్షయరహిత సమాజాన్ని తీర్చిదిద్దాలన్న ప్రపంచ దేశాల లక్ష్యాన్ని సాధించే దిశగా తాము కృతనిశ్చయంతో ముందుకు పోతున్నామని, ఈ లక్ష్యం పేదలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. సరైన, పూర్తి చికిత్సే ఈ వ్యాధి నిర్మూలనకు తోడ్పడుతుందని పేర్కొన్న ఆయన దీని నివారణకు కృషి చేస్తున్న సంస్థలు, ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 2025 నాటికి సమాజంలో ఈ వ్యాధి ఉండరాదన్న లక్ష్యంతో కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయన్నారు. దీంతో 2030 నాటికి టీబీ రహిత సమాజం నిర్మించాలన్న ప్రపంచ దేశాల లక్ష్యానికన్నా ఐదు సంవత్సరాల ముందే మనం దీనిని చేరుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం టీబీపై పూర్తి అవగాహన పెంచడమే కాక, రోగులకు చికిత్స అందించడంలో ఎంతో ఉపయోగపడుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
క్షయను అంతం చేస్తాం: ప్రీతి సుడాన్
భారతదేశాన్ని 2025 నాటికి క్షయరహిత దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు. లక్ష్యాన్ని సాధించడానికి ఇందులో డాకర్లు, పారామెడికోస్, ఆరోగ్య, సామాజిక కార్యకర్తలు భాగస్వాములవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025 నాటికి దేశంలో ఒక్క టీబీ (క్షయ) రోగి కూడా ఉండరాదన్నది లక్ష్యమన్నారు. దేశంలో పోలియోను పూర్తిగా అంతం చేయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని, అలాగే అన్ని వర్గాల సహకారంతో క్షయ వ్యాధిని సైతం లేకుండా చేయడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో దేశాన్ని క్షయరహితంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. 2018లో కొత్తగా 21.5 లక్షల టీబీ కేసులను గుర్తించామన్నారు. ఈ వ్యాధికి ఉచిత పరీక్షలు, చికిత్స సౌకర్యాలను దేశమంతటా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన యూనివర్సల్ డ్రగ్ సస్పెస్టబులిటీ టెస్టింగ్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టామన్నారు. ఇంజక్షన్ రహిత చికిత్సా విధానం వైపు దేశం పయనిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిక్షయ్ పోషణ్ యోజన (ఎన్‌పీవై) ద్వారా 15 లక్షల మంది టీబీ రోగులకు పోషక ఆహారాన్ని అందించినట్టు తెలిపారు. ప్రజలను చైతన్యపర్చడానికి వివిధ రాష్ట్రాల్లో టీబీ ఫోరమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల చికిత్స విజయవంతం రేటు 25 నుంచి 83 శాతానికి పెరుగగా, రోగుల సంఖ్య 29 నుంచి నాలుగు శాతానికి తగ్గిందని ప్రీతి సుడాన్ తెలిపారు.