జాతీయ వార్తలు

మైసూర్ సిరా.. అక్రమాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అటు ప్రభుత్వం, ఇటు సామాజికవేత్తలు, ప్రముఖులు నిత్యం ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. తాము ఓటు వేసామంటూ గర్వంగా సిరా గుర్తు ఉన్న వేలిని ప్రముఖులు, సామాన్యులు సైతం చూపించడం మనం ఎన్నికల సమయంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా? దానిని ఒక్క ఎన్నికల్లోనూ ఉపయోగిస్తారా? మిగిలిన దేనిలోనైనా వాడతారా? అన్న ప్రశ్నలు మనలో తలెత్తడం సహజమే. ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా దానికి అవసరమయ్యే సిరా బాటిళ్లను సరఫరా చేసేది మాత్రం మైసూర్ పెయింట్స్ వారే. వీరు కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలోని 30 దేశాలకు ఈ ఇంక్‌ను సరఫరా చేస్తున్నారు. అంతేకాదు. బ్యాంకులు, కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యకలాపాల్లో అవకతవకలు, ట్యాంపరింగ్, డబ్లింగ్ తదితరమైనవి చోటుచేసుకోకుండా ఈ ఇంక్‌ను ఉపయోగిస్తున్నారు. మామూలుగా పెన్నుల్లో ఉపయోగించే సిరాకు, దీనికి చాలా తేడా ఉంది. పెన్నులో ఉపయోగించే సిరా మన శరీరంపై వేసినా అది కడిగేస్తే పోతుంది. కాని ఈ సిరా తుడిచేసినా, కడిగినా పోదు. కొన్ని రోజుల పాటు ఆ గుర్తు అలాగే ఉంటుంది. ఒకసారి ఓటు వేసిన వారు మరొకరి పేరున మళ్లీ ఓటు వేయకుండా రిగ్గింగ్ నిరోధించే ప్రధాన ఉద్దేశంతోటే ఎన్నికల్లో ఈ సిరాను ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ ఇంక్ గుర్తును ఎన్నికల సమయంలో ఎడమచేతి చూపుడు వేలు చివరన వేస్తుంటారు. స్వల్ప వ్యవధిలో రెండు మూడు ఎన్నికలు వంటివి జరిగితే ఈ వేలును మారుస్తారు. అంటే మొదట జరిగిన ఎన్నికలో చూపుడువేలుకు సిరా గుర్తు వేస్తే స్వల్ప వ్యవధిలో జరిగిన రెండో ఎన్నికలో మధ్య వేలో, చిటికిన వేలుకో వేస్తారు. ఈ సిరా కనీసం 15 రోజుల వరకు చెరిగిపోకుండా (ఏదైనా కెమికల్‌తో తుడిచేస్తే తప్ప) ఉంటుంది. ఓటు వేసిన తర్వాత ఈ ఇంక్‌ను తుడిచివేసి మరో ఓటుకు ప్రయత్నించడం నేరం. ఎన్నికల్లో ఇలా చేసి చట్టానికి చిక్కిన వారు ఎందరో ఉన్నారు కూడా. ప్రస్తుతం ఎన్నికల్లో 10 క్యూబిక్ సెంటీమీటర్ల పరిణామంలోని బాటిళ్లను ఎన్నికలకు ఉపయోగిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో 23 లక్షల సిరా బాటిళ్లు
వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే నిమిత్తం ప్రభుత్వం 33 కోట్ల రూపాయల విలువైన 23 లక్షల ఇంక్ బాటిళ్లను ఆర్డర్ ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఏడు విడతలుగా జరిగే ఈ సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 11న ప్రారంభమై మే 19తో ముగుస్తాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అధికారులు 21.5 లక్షల చెరగని ఇంక్ బాటిళ్లను ఆర్డర్ ఇవ్వగా, ఈసారి వాటికంటే 4.5 లక్షలు అధికంగా వినియోగించనున్నారు. ఇంక్ తయారీకి ఎన్నికల కమిషన్ ఆధీకృత సంస్థగా గుర్తించిన కర్నాటక ప్రభుత్వరంగ ఆధ్వర్యంలో నడిచే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు ఈ ఇంక్ బాటిళ్ల తయారీ ఆర్డర్‌ను ఇచ్చినట్టు మైసూర్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఒక్కోదానిలో 10 సీసీ ఉండే 26 లక్షల ఇంక్ బాటిళ్ల తయారీకి ఆదేశం ఇచ్చామన్నారు. గత సార్వత్రిక ఎన్నికల కన్నా ఈసారి అధిక సంఖ్యలో ఓటర్ల సంఖ్య ఉండటం, పోలింగ్ కేంద్రాలు పెరగడం తదితర కారణాల వల్ల ఈసారి 4.5 లక్షల ఇంక్ బాటిళ్లను అధికంగా తయారు చేయిస్తున్నామన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ సహాయంతో 1962లో ఎన్నికల కమిషన్, నేషనల్ ఫిజికల్ లేబరేటరీ, నేషనల్ రీసెర్చి డెవలప్‌మెంట్ కలిసి ఎన్నికలకు ఉపయోగించే ఇంక్ సరఫరాకు సంబంధించి మైసూర్ పెయింట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయని చంద్రశేఖర్ తెలిపారు. అప్పటి నుంచి భారత్‌లో ఏ ఎన్నికలు జరిగినా తామే ఇంక్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే మనదేశంలో నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల్లో నోట్ల మార్పిడి విషయంలో అవకతవకలను, డబ్లింగ్‌లను గుర్తించడానికి వీలుగా ఈ ఇంక్‌ను సరఫరా చేయమని ప్రభుత్వం తమను కోరిందని, అప్పట్లో బ్యాంకులు కొందరు కస్టమర్ల వేలిపై గుర్తుగా వేసిన ఇంక్ సైతం తాము సరఫరా చేసిందేనని ఆయన తెలిపారు.