జాతీయ వార్తలు

శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఫరూక్ అబ్దుల్లా నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 25: ప్రతిష్థాత్మక శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 18న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. శ్రీనగర్ స్థానం నుంచి మరోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ఫరూక్ తన కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారు. టంకీపురా ప్రాంతంలో డిప్యూటీ కమీషనర్ కార్యాలయంలో శ్రీనగర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు సమయంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, వాహనాలపై రిటర్నింగ్ అధికారి మార్గదర్శకాలు విధించిన విషయం విదితమే.