జాతీయ వార్తలు

పల్లెలకు వైద్యం చేరాలి: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మద్‌నగర్, మార్చి 25: గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు కృషి జరగాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఆరోగ్య భద్రత సాకారం కావాలంటే దానిపై దృష్టిసారించాలని అన్నారు. ప్రవర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ 13వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని లోనీలో ఈడీమ్డ్ వర్శిటీ ఉంది. వైద్యవిద్య పూర్తిచేసుకున్న తరువాత మూడేళ్ల పాటు గ్రామాల్లో పనిచేయాలన్నది కచ్చితంగా అమలుకావాలని వెంకయ్య స్పష్టం చేశారు. మొదటి ప్రమోషన్‌కు ముందు మూడేళ్లు పల్లెలో వైద్య సేవలందించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 437 మంది మెడికోలకు ఆయన డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థినులు ఉండడం పట్ల ఉప రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారితతోనే అభివృద్ధి సాకారమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. యువత చేతుల్లోనే దేశ భవిత ఆధారపడి ఉందని ఆయన అన్నారు. ఐరాస నివేదికను ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. అన్ని రంగాల్లోనూ యువత శక్తి, సామర్థ్యాలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. గ్రామ రాజ్యం లేకుండా రామరాజ్యం సాధించలేమని ఆయన నొక్కిచెప్పారు.