రాష్ట్రీయం

మలావత్ పూర్ణ మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న ఎత్తయిన శిఖరాలను అధిరోహిస్తున్న తెలంగాణ గురుకుల విద్యార్థిని మలావత్ పూర్ణ తాజాగా ఇండోనేషియాలోని కార్‌స్టెంజ్ పిరమిడ్‌ను అధిరోహించి రికార్డు సృష్టించింది. పూర్ణ అతి పిన్నవయస్సులో వౌంట్ ఎవరెస్టును అధిరోహించి చరిత్ర సృష్టించింది. అనంతరం 2016లో కిలిమంజారో, 2017లో వౌంట్ ఎల్‌బ్రూస్, 2019లో వౌంట్ అకాంగువాలను అధిరోహించింది. కామారెడ్డి, తాడ్వాయి గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేస్తున్న పూర్ణా ఇండోనేషియాలో 4884 మీటర్ల ఎత్తయిన పిరమిడ్‌ను అధిరోహించడంపై గురుకుల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆమెను అభినందించారు. ప్రపంచంలో ఏడు ఎత్తయిన శిఖరాల్లో ఇప్పటికే ఐదు శిఖరాలను అధిరోహించిన పూర్ణా మరో రెండు శిఖరాలు అధిరోహిస్తే ప్రపంచంలో ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించనున్నారని అన్నారు. ఇండోనేషియా పిరమిడ్ అధిరోహణ అత్యంత సవాలుతో కూడుకున్నదని, భారీ వృక్షాల మధ్య బేస్ క్యాంప్‌కు చేరుకోవల్సి ఉంటుందని, అక్కడి నుండి అనేక రాళ్లు, రప్పలు, ఎత్తయిన పర్వతాల మధ్య పైకి అధిరోహించాల్సి ఉంటుందని చెప్పారు. భువనగిరి కోటపైన ప్రాక్టీస్ చేసిన పూర్ణకు అది ఎంతో సహకరించిందని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఇండోనేషియా పిరమిడ్ అధిరోహణకు మార్చి 17న హైదరాబాద్ నుండి బయలుదేరిందని, ఆమె శిక్షణ వ్యయాన్ని హైదరాబాద్‌కు చెందిన ట్రానె్సండ్ సంస్థ భరిస్తోందని అన్నారు.