జాతీయ వార్తలు

రాహుల్‌దే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడొకరు మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షీలాదీక్షిత్, పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సోమవారం ఇక్కడ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఎన్నికల పొత్తుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఆప్‌తో ఎన్నికల సర్దుబాట్లకు సంబంధించి తుది నిర్ణయం రాహుల్ గాంధీనే తీసుకోవాలంటూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పీసీసీ మాజీ అధ్యక్షులు అజయ్ మాకెన్, సుభాష్ చోప్రా, తజ్దార్ బాబర్, అర్వింద్ సింగ్ లవీ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్నవారంతా దాదాపు ఆప్‌తో పొత్తుకే మొగ్గుచూపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పొత్తు విషయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే అప్పగించినట్టు సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ‘ఏఐసీసీ ఢిల్లీ ఇన్‌చార్జి పీసీ ఛాకో అధినాయకత్వానికి పరిస్థితిని వివేదించారు. 12 మంది డీసీసీ అధ్యక్షుల సంతకాలు తీసుకున్నారు. పార్టీ సీనియర్లు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, పలువురు కార్పొరేటర్ల అభిప్రాయాలు ఛాకో తెలుసుకున్నారు. వాటన్నింటినీ రాహుల్‌కు నివేదించారు. దాదాపు అందరూ ఆప్‌తో పొత్తుకు సముఖంగా ఉన్నారు’ ఆయన తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు షీలాదీక్షిత్, వర్కింగ్ ప్రెసిడెంట్లు దేవేందర్ యాదవ్, రాజేష్ లిలోహితా, హరూమ్ యూసుఫ్ మాత్రం ఆప్‌తో ససేమిరా పొత్తు వద్దంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకోసం ఆమ్ ఆద్మీ పార్టీ సుముఖంగానే ఉంది. బీజేపీని గద్దెదించడానికి కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలుంటాయని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి సానుకూలత కనిపించడం లేదు. కాంగ్రెస్ అభిప్రాయం కోసం ఎదురుచూసిన తరువాత ఆఖరి అభ్యర్థిని ఆప్ ప్రకటించింది. కాగా కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తులేకపోయినా ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ ఆప్ గెలుస్తుందని అంతర్గత సర్వేల్లో వెల్లడికావడంతో పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ దూకుడు పెంచారు. అయితే కాంగ్రెస్-ఆప్ పొత్తుతో బీజేపీని కట్టడి చేయవచ్చని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల రెండు పార్టీల నేతలతో మంతనాలు సాగించారు.