జాతీయ వార్తలు

అరుణాచల్ ‘మండి’లో రసవత్తర పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, మార్చి 26: దేశంలోని అతి తక్కువ ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్‌లో మండి లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నిక ఇద్దరు ‘రామ్’లకు ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ ఈ సీటును ఎట్టిపరిస్థితుల్లో గెల్చుకోవాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు పార్లమెంట్ స్థానాలకు మే 19న ఎన్నికలు జరగనున్నాయి. మండి స్థానానికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామస్వరూప్ శర్మనే తిరిగి పోటీలో ఉంచగా, ఆయనకు ముఖ్యమంత్రి జయరామ్ బహిరంగంగా మద్దతు పలుకుతుండగా, ఇదే స్థానంలో సుఖ్‌రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించి అది రాకపోవడంతో కాంగ్రెస్ వైపు దృష్టి సారించారు. సుఖ్‌రామ్, ఆయన మనవడు కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఆశ్రయ్‌శర్మకు ఇంచుమించు మండి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ టికెట్ ఖరారైనట్టేనని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మండి నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనిది. దీంతో ఆయన రామస్వరూప్ శర్మ గెలుపును సవాల్‌గా తీసుకున్నారు. అదే సమయంలో తన మనవడిని ఎలాగైనా గెలిపించాలని సుఖ్‌రామ్ గట్టిపట్టుదలతో ఉన్నారు. 91 ఏళ్ల ఈ సీనియర్ నేత పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు టెలికాం మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా 1984, 1991, 1996లో ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించారు. కాగా ఆశ్రయ్ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కొద్దివారాల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరకముందే ఈ నియోజకవర్గ పరిధిలోని 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో సెరాజ్, జోగిందర్ నగర్ తప్ప మిగిలిన 15 సెగ్మెంట్లలో ప్రచారాన్ని నిర్వహించినట్టు ఆశ్రయ్ తెలిపారు. ఇలావుండగా సుఖ్‌రామ్ కుమారుడు, ఆశ్రయ్ తండ్రి అయిన అనీల్ శర్మ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న సీఎం జయరామ్ ఠాకూర్ కేబినెట్‌లో విద్యుత్ మంత్రిగా ఉండటం విశేషం. కాగా, ఈ ఎన్నికల్లో తన మనవడితో కలిసి సుఖ్‌రామ్ కాంగ్రెస్‌లో చేరడంతో అనీల్‌శర్మ రాజకీయ జీవితం సందిగ్ధంలో పడింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిగా ఉండాలా లేక రాజీనామా చేయాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది అనీల్‌శర్మే’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైన అనీల్‌శర్మ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మంత్రివర్గంలో 1993 నుంచి 96, 2013 నుంచి 2017లో పనిచేశారు. కాగా, మండి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రామస్వరూప్ శర్మ 2014 ఎన్నికల్లో దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి, వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్‌పై విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మిగిలిన మూడు సీట్ల కన్నా మండి నియోజకవర్గం ఫలితంపైనే రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.