జాతీయ వార్తలు

వారణాసి ఆంధ్రాశ్రమంలో బతుకమ్మ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాశి, అక్టోబర్ 19: మహా పుణ్యక్షేత్రం వారణాశిలోని శ్రీరామ తారకాంధ్ర ఆశ్రమంలో విజయ దశమి సందర్భంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామతారకాంధ్ర ఆశ్రమానికి తెలుగు రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున తెలుగు యాత్రికులు వస్తుంటారు. నవరాత్రుల్లో కాశీ యాత్రకు వచ్చిన తెలంగాణ ఆడపడుచులకు తమ స్వస్థలంలో పండుగ జరుపుకోలేదనే లోటు లేకుండా బతుకమ్మ సంబరాలను నిర్వహించినట్లు ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ సుందర శాస్ర్తీ చెప్పారు. తొలిసారిగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. ఆంధ్రాశ్రమంలో ఉన్న తెలంగాణప్రాంత ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టీ సుందర శాస్ర్తీ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ఆనవాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళలు తమ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించారన్నారు. ఈ వేడుకులను ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు తిలకించి ఆనందపరవశులయ్యారని చెప్పారు.