రాష్ట్రీయం

38మందితో బీజేపీ జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున బరిలోకి దిగే అభ్యర్థుల 38 అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. శనివారం అభ్యర్థుల ఎంపీకపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం పార్టీ కేంద్ర కార్యలయంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌తోపాటు పార్టీప్రధాన కార్యదర్శులు రామ్‌మాధవ్, మురళీధర్‌రావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కే. లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్రంమంత్రి జేపీ నడ్డా తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. డాక్టర్ లక్ష్మణ్ (ముషిరాబాద్),
కిషన్ రెడ్డి (అంబర్‌పేట), ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ (ఉప్పల్), చింతల రాంచంద్రారెడ్డి (ఖైరాతాబాద్), రాజాసింగ్ (గోషామహల్), ఎన్. రాంచందర్‌రావు (మల్కాజిగిరి), పెరాల శేఖర్‌రావు (ఎల్‌బీ నగర్), జీ. రామకృష్ణా రెడ్డి (పెద్దపల్లి), సంకినేని వెంకటేశ్వర్ రావు (సూర్యాపేట),
పీ. మోహన్ రెడ్డి (మేడ్చల్), టీ. ఆచారి (కల్వకుర్తి), జీ. మనోహర్ రెడ్డి (మునుగోడు), కొండపల్లి శ్రీధర్ రెడ్డి (పాలేరు), బండి సంజయ్ (కరీంనగర్), ఎం. రఘునాథరావు (దుబ్బాక), బాబూమోహన్ (ఆందోల్), కుంజా సత్యవతి (్భద్రాచలం), పాయల్ శేఖర్ (ఆదిలాబాద్), డాక్టర్ పీ. రామదేవి (ముదోల్), రతన్ పాండు రంగారెడ్డి (నారాయణపేట్), యెండల లక్ష్మినారాయణ (నిజామాబాద్ అర్బన్), సంతోష్‌కుమార్ చంద (పినపాక), కొండయ్య (ముత్కల్), వినయ్‌కుమార్ రెడ్డి (ఆర్ముర్), కే. అంజయ్య (్ధర్మపురి), గడ్డం నాగరాజు (మనకొండురు), విజయ చంద్రరెడ్డి (పరకాల), కేశ్‌పల్లి అనంద్ రెడ్డి (నిజామాబాద్ రూరల్), పటేల్ రవిశంకర్ (తాండురు), మల్లేశ్వర్ (అచ్చంపేట), నంబూరి రామలింగేశ్వరరావు (సత్తుపల్లి), జీ. వెంకట్ (కోరుట్ల), అమర్ సింగ్ (కర్వాన్), గద్వల్ వెంకటాద్రి రెడ్డి (గద్వాల్) ఏన్. శ్రీవర్ధన్ రెడ్డి(షాద్‌నగర్), కీర్తిరెడ్డి (్భపాల్‌పల్లి), ఇమ్మాజీ (బెల్లంపల్లి), మాడలి రాజు (బోధ్) మొదటి జాబితాలో ఉన్నారు.