జాతీయ వార్తలు

మృతుల్లో అత్యధికులు యూపీ, బిహార్ కూలీలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, అక్టోబర్ 20: దసరా పండుగనాడు జరిగిన అమృత్‌సర్ రైలు ప్రమాదంలో మృతుల్లో ఎక్కువ మంది బిహార్, యూపీకి చెందినవారే. నిరుపేద వలస కూలీలేనని అధికారులు శనివారం వెల్లడించారు. ఘోర ప్రమాదంలో 61 మంది చనిపోగా 39 మృత దేహాలను గుర్తించారు. మృతుల్లో అత్యధికులు యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులేనని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పారిశ్రామిక వాడలో కూలీలుగా బతుకీడుస్తున్నవారిని మృత్యువుకబళించింది. జోదాపాఠక్ రైలు పట్టాల పక్కన నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిలే వలస కార్మికులే ఎక్కువ మంది ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. మృతులు, గాయపడ్డవారిలోనూ రెండు రాష్ట్రాల వలస కార్మికులే ఎక్కువ మంది ఉన్నారని వారన్నారు. రావణ దహన కార్యక్రమం చూడడానికి ట్రాక్‌పైకి వచ్చి రైలుకు బలైపోయారు. ఆ సమయంలో రైతు హారన్ కూడా వేయలేదని పలువులు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఘోర ప్రమాదంపై జగునానందన్ అనే 40 ఏళ్ల కార్మికుడు మీడియాకు వెల్లడించారు. హర్డొయ్‌కు చెందిన ఈ వలస కార్మికుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తల, కాలుపై తీవ్రగాయాలయ్యాయి. ‘నేను అసలు రైలు ట్రాక్స్ పక్కనే నిలబడలేదు. రావణుడి దిష్టిబొమ్మ దహనం జోరందుకోగా అందరూ పరుగెలెత్తుకుంటూ వచ్చారు. జనం ఒక్కసారిగా నన్ను ట్రాక్‌పైకి తోసేశారు’ అని అతడు కన్నీళ్ల పర్యంతమయ్యారు. నలుగురు పిల్లల తండ్రైన జగునానందన్‌కు బంధువులు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం తరువాత బంధువులకు అప్పగించారు. వారి సొంత ఊళ్లకు మృతదేహాలు తరలించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇంత పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ రూట్‌లో రైలు సర్వీసులు నిలిపివేశారు.