బిజినెస్

పెరుగుతున్న ఏటీఎంల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలో ఏటీఎంల సంఖ్య పెరుగుతున్నది. గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి ఏటీఎంలు పెరిగాయి. 2,22,568 లక్షల ఏటీఎంలు గత ఏడాది ఆగస్టులో ఉండగా, ఈ ఏడాది అదే కాలానికి 2,28,422 ఏటీఎంలు ఉండడం గమనార్హం. అయితే, ద్రవ్య లబ్ధతపై అటు కేంద్రం, ఇటు రిజర్వ్ బ్యాంక్ కొన్ని పరిమితులను విధించిన నేపథ్యంలో ఏటీఎంలు పెరుగుతున్నా, వాటిలో ఎక్కువ శాతం పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పని చేయని ఏటీఎంలు ఎన్ని ఉంటే ఏమిటన్న ప్రశ్న వినిపిస్తున్నది. కానీ, మారుమూల గ్రామాల్లోనూ ద్రవ్య లబ్ధతను పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే ఏటీఎంలను పెంచుతున్నామని కేంద్రం వ్యాఖ్యానిస్తున్నది.