బిజినెస్

బెంగళూరు నుంచి పెరగనున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 26: బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు పెరగనున్నాయి. ఈ ఏడాది శీతాకాలంలో ఓవర్‌సీస్ ఫ్లైట్స్‌ను 17 శాతం పెంచేందుకు వివిధ విమానయాన సంస్థలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే ఎనిమిది అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య కాలంలో అదనంగా మరికొన్ని విమానాలను అందుబాటులో ఉంచనుంది. దీనికి సంబంధించి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (బీఐఏఎల్)తో ఎయిర్ ఇండియా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా కొన్ని విదేశీ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటామని, దీనితో అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరుగుతాయని బీఐఏఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది.