జాతీయ వార్తలు

చాలా చేశా.. ఇంకా ఎంతో చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయిపూర్, నవంబర్ 9: చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 18 సంవత్సరాలైతే అందులో రికార్డుస్థాయిలో డాక్టర్ రమణసింగే 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను రాష్ట్రానికి ఇంకా చేయాల్సింది చాలా ఉందికాబట్టి ఈ ఎన్నికల్లోనూ తననే మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు. ఢిల్లీ తనకు చాలా దూరమని, రాష్ట్ర అభివృద్ధే తనకు లక్ష్యమని ఆయన అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఎంతో సంతృప్తిని మిగిల్చిందని, ఇప్పటివరకు ప్రజలు తనపట్ల చూపిన ప్రేమ, ఆదరణ మరువలేనని ఆయన అన్నారు. ‘నా దృష్టిలో ఢిల్లీ నాకు చాలా దూరం.. అక్కడి పదవికన్నా చత్తీస్‌గఢ్ ప్రజలకు సేవ చేయడంలోనే నాకు ఆనందం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. తన 15 ఏళ్ల పదవీకాలంలో ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా రమణసింగ్‌తో పాటు మంచి అనుభవమున్న నాయకులను కేంద్రంలోకి తీసుకురావాలని యోచిస్తోందని వార్తలు వచ్చాయి. దీనిపై 66 ఏళ్ల ఈ సీనియర్ నేత వివరణ ఇస్తూ గతంలో తాను అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసానని చెప్పారు. అయితే కేంద్రంలో పనిచేయడం కన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవచేయడం తనకు ఎంతో సంతృప్తిని కలుగజేస్తోందని అన్నారు. తాను ఇక్కడ చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నారని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపర్చడానికి ఎంతో కృషి చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో రమణసింగ్‌కు ఎదురుగాలి వీస్తోందని, ఈసారి ఆయనకు ఓటమి తప్పదని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టివేస్తూ ఈసారి కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, నాలుగోసారి కూడా తాను ముఖ్యమంత్రి పదవి చేపడతానని రమణసింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై కొంత ఉంటుందని, అలాగని, వీటిని మోదీ పాలనకు రిఫరెండంగా భావించరాదని ఆయన అభిప్రాయపడ్డారు. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బస్తర్‌లాంటి ప్రాంతాల్లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉందని ఆయన అంగీకరిస్తూ ఈసారి ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని హామీనిచ్చారు.
కాగా, రాజకీయాల్లోకి రాకముందు ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేసిన రమణసింగ్ 1980లో రాజకీయ ప్రవేశం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి నూతన రాష్ట్రంగా అవతరించిన చత్తీస్‌గఢ్‌లో రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాలకే కాంగ్రెస్ నుంచి అధికారాన్ని 2003లో కైవసం చేసుకుంది. అప్పటి నుంచి అప్రతిహతంగా రాష్ట్రంలో బీజేపీ పాలన కొనసాగుతోంది. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రమణసింగే తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో 90 సీట్లకు ఈ నెల రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటివిడతగా నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న 18 స్థానాల్లో8 ఈనెల 12, మిగిలిన 72 సీట్లకు ఈ నెల 18న ఎన్నికలు జరుగుతాయి.