జాతీయ వార్తలు

నోట్ల రద్దుతో జనజీవనం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: పెద్దనోట్ల రద్దు చేసి రెండేళ్లయిన సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఢిల్లీలోని ఆర్‌బీఐ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. డిమోనిటైజేషన్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిందని, నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. ఆర్‌బీఐ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. ఆందోళనకారులు బలవంతంగా బస్సుల్లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, ఆనంద్ శర్మ, భూపేందర్‌సింగ్ హుడా కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వ నిర్వాకం వల్లే దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే ఆరోపించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఆర్‌బీఐ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేయడం వల్ల మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రెండేళ్లయినా డిమోనిటైజేషన్ గాయాలు మానలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం అదుపుపేరుతో పెద్దనోట్లను రద్దుచేసి మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. 1000, 500 రూపాయల నోట్లను రద్దుచేసిన కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఏటీఎంలలో నగదులేక జనం రోడ్లపైకి వచ్చారు. ప్రతిపక్షాలు సైతం నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. కేంద్రం తప్పుడు సలహాలతో దేశ ప్రజల జీవితాలతో ఆకలాడుకుంటోందని తీవ్రంగా ధ్వజమెత్తారు.
అదొక పెద్ద స్కాం
పెద్ద నోట్ల రద్దు ఒక స్కాం అని నల్లధనాన్ని మార్చుకునేందుకు కేంద్రం దొంగ ఎత్తులతో ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా విమర్శించారు.
మోదీ ప్రభుత్వ వ్యవహార శైలి ఆర్థిక దివాళాకోరు విధానాలకు దారితీసిందన్నారు. ఇదొక విపత్తు అని ఆయన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏమి సాధించారో చెప్పడంలో కేంద్రంవిఫలమైందన్నారు. 99 శాతం కరెన్సీ నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐ పేర్కొన్నదన్నారు. నోట్ల రద్దు ఒక పెద్ద స్కాం అన్నారు. నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చేందుకు ఐశ్వర్యవంతులకు ఉపయోగపడిందన్నారు. ఇక్కడ ఆర్‌బీఐ కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నోట్ల రద్దు తీరును నిరసిస్తూ ధర్నా చేశారన్నారు. పేదలకు, మధ్య తరగతి వర్గాలు ఇప్పటికీ ఈ నోట్ల రద్దు వల్ల కోలుకోలేకపోయారన్నారు. 1.5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, జీడీపీలో ఒక శాతం ఆదాయం నష్టం వచ్చిందన్నారు. ఆదాయం పన్ను చెల్లింపుదారులు పెరిగారన్న దానిపై లెక్కలు చెప్పడం లేదన్నారు. అవినీతి పరులకు ప్రోత్సహం ఇచ్చే విధంగా కేంద్ర విధానాలు ఉన్నాయన్నారు.