జాతీయ వార్తలు

మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ఈ నెలలో రెండోసారి వంట గ్యాస్ ధరలను పెంచారు. సిలిండర్‌కు రూ.2 చొప్పున పెంచారు. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 507.42 పైసలుగా నిర్ణయించారు. అంతకు ముందు ఈ ధర రూ. 505.34 పైసలు ఉండేది. ఈ వివరాలను చమురు మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే కమిషన్‌ను పెంచారు. 14.2 కేజీల సిలిండర్‌కు రూ.50.58 పైసలు, ఐదు కేజీల సిలిండర్‌కు కమిషన్ రూ. 25.29పైసలను చెల్లిస్తారు. ఈ నెల 1వ తేదీన సిలిండర్‌పై రూ.2.94 పైసల చొప్పున పెంచారు.
ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెల వంట గ్యాస్ ధరను పెంచుతున్నారు. ముబయిలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 505.05 పైసలు, చెన్నైలో రూ. 495.39పైసలుగా నిర్ణయించారు. స్థానిక పన్నులు, రవాణా చార్జీలను కలుపుకుని వంటగ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయిస్తారు. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీని భరిస్తుంది. పన్ను నిబంధనల కింద మార్కెట్ రేటుప్రకారం ఎల్‌పీజీపై జీఎస్‌టీని నిర్ణయిస్తారని ప్రభుత్వం పేర్కొంది. వంట గ్యాస్ సిలిండర్ల డెలివరీకి వినియోగదారులు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.