జాతీయ వార్తలు

కాంగ్రెస్ సీట్లు అమ్ముకుంటోంది: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 9: కాంగ్రెస్‌లో అవినీతిలో కొట్టుమిట్టాడుతోందని, టిక్కెట్లను కాంగ్రెస్ నేతలు అమ్ముకుంటున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. ఇటీవల సోషల్ మీడియాలో రాజస్తాన్‌లోని ఫలోడీ అసెంబ్లీ సీటును రూ.3.5 కోట్లకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు, కాంగ్రెస్‌పార్టీ ఈ సీటు టిక్కెట్‌ను అమ్ముకుంటోందని సామాజిక మాద్యమంలో కథనం ప్రసారమైంది. కాని ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలెట్ తోసిపుచ్చారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ ఇటువంటి కుయుక్తులకు పాల్పడుతోందన్నారు. తమ పార్టీ పారదర్శకంగా సీట్లను కేటాయించిందన్నారు. తమ పార్టీ గెలవడం తథ్యమని, ఓర్వలేక బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. దీనికి బీజేపీ శాఖ స్పందించింది. కాంగ్రెస్ రక్తంలోనే అవినీతి ఉందని, ఫలోడీ సీటు రూ.3.5 కోట్లుంటే, 200 అసెంబ్లీ సీట్ల రేటెంత అని ఆయన నిలదీశారు. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ కూడా ఈ వివాదంలో తలదూర్చారు. ఆయన చేసిన కామెడీ వివాదస్పదమైంది. ఈ ఎన్నికల తర్వాత కౌన్ బనేగా కరోడ్‌పతి అని ఆయన ప్రశ్నించారు.