జాతీయ వార్తలు

నేడు రెండో జాబితా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు మంగళవారం సాయంత్రం కర్నాటక భవన్‌లో సమావేశమై రెండో జాబితా తయారీపై దృష్టి కేంద్రీకరించారు. మొదటి జాబితాలో 65 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. టికెట్లకోసం ఇద్దరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాలు రెండో జాబితాలో ఉండటం తెలిసిందే. మొదటి జాబితాపై వ్యక్తమవుతున్న నిరసనల కంటే రెండో జాబితాపై ఎక్కువ నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. టికెట్ లభించనివారు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగే ప్రమాదం లేకపోలేదు. దీనితోపాటు టికెట్లు లభించని కొందరు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశమూ లేకపోలేదు. అందుకే కాంగ్రెస్ నాయకులు రెండో జాబితా తయారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి రెండో జాబితాను సిద్ధం చేసినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదముద్ర పడితే తప్ప ప్రకటించేందుకు వీలులేదు. రాహుల్ ఢిల్లీకి వచ్చిన తరువాత రెండో జాబితాను సమీక్షిస్తారా లేక చత్తీస్‌గఢ్ నుంచే పరిశీలించి ఆమోదిస్తారా అనేది వేచిచూడాల్సిందే.