జాతీయ వార్తలు

జగన్ హత్యకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిపై మూడో పక్షంతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హాత్యాప్రయత్నం వెనక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నదనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదా న్యాయ వ్యవస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. విజయ సాయిరెడ్డి, నేమినేని ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్ మంగళవారం సాయంత్రం రాష్టప్రతి కోవింద్‌ను కలిసి ఈ మేరకు ఆరు పేజీల వినతిపత్రం అందజేశారు. ఈ హత్యా ప్రయత్నం వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం పక్షపాతంతో కూడిన దర్యాప్తు జరిపిస్తోందని వారు రాష్టప్రతికి ఫిర్యాదు చేశారు. జగన్‌పై జరిగిన హత్యా యత్నానికి చంద్రబాబే సూత్రధారి అని వారు ఆరోపించారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్‌పీ ఠాకూర్, తెలుగుదేశం నాయకులు ఆదినారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, సినీ నటుడు శివాజీకి కూడా హత్యాప్రయత్నంతో సంబంధం ఉన్నదని వారు రామ్‌నాథ్ కోవింద్‌కు తెలిపారు. జగన్‌పై జరిగిన హత్యా ప్రయత్నంపై నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిగితేనే తమకు న్యాయం కలుగుతుందని వారు కోవింద్‌కు విన్నవించుకున్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా ఒక వ్యక్తి కత్తితో విమానాశ్రయంలోకి వెళ్లగలవుగుతారా? అని వారు ప్రశ్నించారు. విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పని చేయకపోవటం ఏమిటనేది కూడా వారు రాష్టప్రతికి వివరించారు. హత్యా ప్రయత్నం చేసిన శ్రీనివాస రావు కేవలం నెల రోజుల క్రిందటే విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లో చేరాడు.. అతనిపై క్రిమినల్ కేసులున్నా నో ఆబ్జెక్షన్ సర్ట్ఫికెట్ ఎలా ఇచ్చారనేది తేలవలసి ఉన్నదని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయదు.. ముఖ్యమంత్రి, డీజీపీ మాట్లాడిన తీరే అందుకు నిదర్శనమని వారు రామ్‌నాథ్ కోవింద్‌కు చెప్పారు. జగన్‌మోహన్ రెడ్డిని హతమార్చవలసిన అవసరం శ్రీనివాస్‌రావుకు ఎంతమాత్రం లేదు.. ఈ హత్యాప్రయత్నం వెనక పెద్దకుట్ర ఉన్నది.. జగన్‌ను అంతమొందిస్తే లాభపడేది చంద్రబాబు నాయుడు అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని తాము రాష్టప్రతికి విజ్ఞప్తి చేశామని మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిని అంతమొందించాలని ఆలోచించటం అత్యంత నీచమైన చర్య అని వారు విమర్శించారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తాము చెప్పినదంతా సావకాశంగా విని తాను చేయగలిగింది చేస్తాననే హామీ ఇచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తెలిపారు.