జాతీయ వార్తలు

శబరిమల తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: శబరిమల ఆలయంలో అన్ని వయస్సులకు చెందిన మహిళలకు ప్రవేశం కల్పించడంపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కాగా గతంలో ఈ విషయమై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పునస్సమీక్షిస్తామని కోర్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన సుప్రీం కోర్టు ఈ అంశాన్ని కోర్టులోనే విచారిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. 10-50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు స్వామి అయ్యప్ప ఆలయంలో ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అనేక రివ్యూ పిటిషన్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కోరుక్ట ప్రకటించింది. మంగళవారం ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్వీకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం న్యాయమూర్తుల చాంబర్‌లో విచారించింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఈ పిటిషన్లను ఏ ధర్మాసనం విచారిస్తుందో ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పటికీ మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వబోమని స్పష్టం చేసింది. న్యాయమూర్తుల చాంబర్‌లో రివ్యూ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ చాంబర్‌లో న్యాయవాదులకు ప్రవేశం ఉండదు. అన్ని వయస్సులకు చెందిన మహిళలకు ప్రవేశం కల్పించాలని ఇచ్చిన కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాదాపు 48 పిటిషన్లు దాఖలయ్యాయి.