జాతీయ వార్తలు

డిసెంబర్ 4 నుంచి తుది వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: పన్ను చెల్లింపులకు సంబంధించి 2011-12 నాటికి కేసును పునర్విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే నెల 4వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఐటీ కేసులో తుది వాదనలు వింటామని కోర్టు పేర్కోంది. ఈ కేసులో పిటిషనర్లకు ఉపశమనం కలిగించేందుకు ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదాయం పన్ను శాఖకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కోర్టుకు ఆదాయం పన్ను శాఖ నుంచి న్యాయవాది హాజరయ్యారు. ఈ కేసులో ఐటి శాఖ సుప్రీంకోర్టులో ముందుగా కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలవుతుందనే ఉద్దేశ్యంతో ఐటీ శాఖ కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా సోనియా, రాహల్ గాంధీ దాఖలుచేసిన పిటిషన్లను న్యాయమూర్తులు ఏకే సిఖ్రీ, జస్టిస్ ఎస్‌ఏ అబ్దుల్ నజీర్ విచారించారు. ఈకేసులో ఐటి శాఖ న్యాయవాది హాజరైనందుకు తాము ఆ శాఖకు నోటీసులు ఇవ్వడంలేదన్నారు. ఈ అంశంపై వచ్చే నెల 4వ తేదీన తుది వాదనలు వింటామనికోర్టు పేర్కొంది. హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆదాయం పన్ను రిటర్న్ కేసులు నేషనల్ హెరాల్ట్ పత్రికతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసులో మంగళవారం రాహుల్, సోనియా తరఫున సీనియర్ న్యాయవాదులు పి చిదంబరం, కపపిల్ సిబాల్, అరవింద్ దాటర్‌లు వాదనలు వినిపించారు. ఐటీ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ఈకేసులో సోనియా, రాహుల్‌గాంధీలు ప్రస్తావించిన అంశాలు అభ్యంతరకరమన్నారు. కాగా పిటిషనర్లు పేర్కొన్న అంశాలు పరిశీలించదగినవని కోర్టు పేర్కొంది.