జాతీయ వార్తలు

టికెట్లు రానివారికి పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: శాసనసభకు పోటీ చేసేందుకు టికెట్లు లభించని వారికి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా తెలిపారు. కుంతియా మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని అన్నారు. జిల్లాల వారీగా ఎదురయ్యే అసమ్మతి, అసంతృప్తి సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అసంతృప్తికి గురైన వారితో మాట్లాడుతుతన్నారని కుంతియా వెల్లడించారు. అసంతృప్తి, అసమ్మతిని ఎదుర్కొనేందుకు నాయకులను ఆయా జిల్లాలకు పంపిస్తామని ఆయన తెలిపారు.
టికెట్లు లభించనివారు అసంతృప్తికి గురికావటం సహజమే.. గతంలో ఇలా జరిగింది.. ఇక మీదట కూడా జరుగుతుందన్నారు. నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతున్నప్పుడు పలు సమస్యలు ఎదురవుతాయి.. సీట్ల సంఖ్య ఖరారైన తరువాత ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే సమస్య ఎదురవుతుంది.. కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాలను వదులుకోవలసి వస్తుంది.. కొందరు పార్టీ నాయకులు త్యాగం చేయకతప్పదని కుంతియా తెలిపారు. ఇప్పుడు టికెట్లు లభించనివారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదుకుంటుంది.. వారి ప్రయోజనాలను కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఇలావుండగా రేవంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కుంతియాతో సమావేశమై తన వర్గానికి చెందిన పలువురికి టికెట్లు లభించకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పొన్నాల లక్ష్మయ్య కూడా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలిసి మొదటి జాబితాలో తన పేరు ప్రకటించకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఒకటి, రెండు రోజుల్లో రాహుల్ గాంధీని కలిసి తన వాదన వినిపించే అవకాశాలున్నాయి.