జాతీయ వార్తలు

ముంబయిలో ఘనంగా చాత్ పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 14: ముంబయిలో ఛాత్ పూజ ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిసాయి. లక్షలాది మంది భక్తులు జుహూ బీచ్‌కు చేరుకుని ఉదయించే సూర్యునికి నమస్కారాలు సమర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, నగర బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ మంగళవారం సాయంత్రం ఈ ఉత్సవానికి హాజరై పూజ చేసి సూర్యునికి నమస్కారాలు సమర్పించారు. వారికి ఛాత్ ఉత్సవ మహాసంఘ్ స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ జుహూ బీచ్ ప్రాంతాన్ని ఛాత్ పూజ ఉత్సవ కేంద్రంగా మార్చాలనుకుంటున్నట్టు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పూజ నిమిత్తం వచ్చే భక్తులకు అనువుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ ఉత్సవ నిర్వహణకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన చెప్పారు. కాగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నిరుపమ్ కూడా ఈ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ తీర్పు ప్రాంతం, బిహార్, ఝార్ఖండ్ ప్రాంతాలలో సైతం ఛాత్ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు పెద్దసంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరయ్యారు. సూర్య దేవుడికి ఘనంగా పూజలు చేసే ఈ పండుగ పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. కాగా ఈ పండుగను జుహూ బీచ్‌లోనే కాక నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. అలాగే పొరుగున ఉన్న థానే జిల్లాలో సైతం ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.