జాతీయ వార్తలు

‘ప్రవాస ప్రధాని’ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 14: తరచు విదేశీ పర్యటనల్లో మునిగితేలుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో చాలా తక్కువ కాలం ఉంటున్నారని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విమర్శించారు. ఆయనను ప్రవాస ప్రధాని’ అని ఎద్దేవా చేశారు. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న స్టాలిన్ తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ప్రధాని మోదీకిగానీ ప్రజాస్వామ్యం అంటే ఇష్టం, నమ్మకం లేవని వ్యాఖ్యానించారు. డీఎంకే అధినేతగా ఈ ఏడాది ఆగస్టులో పగ్గాలు చేపట్టిన స్టాల్ మొదటిసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం పట్ల మోదీకి ఏమాత్రం విశ్వాసం లేదని ధ్వజమెత్తారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తల చుట్టూ తిరుగుతూ ఉంటాయని, వారికి లాభయం చేకూర్చడానికి ప్రజా ధనాన్ని దోచిపెడుతున్నారని మోదీని దుయ్యబట్టారు. ఇంత వరకూ ప్రధాని 84 పర్యాయాలు విదేశీ పర్యటనలు చేశారని, కానీ, వాటి వల్ల దేశానికిగానీ, ప్రజలకుగానీ ఒరిగింది ఏమీ లేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలతో కోట్లాది రూపాయల ఖర్చు తప్ప లాభమేమీ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. తమిళనాడులోని ఏఐడీఎంకే సర్కారు ఏ విషయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని, నష్టం జరుగుతున్నా నోరు మెదపడం లేదని విమర్శించారు. నీట్ పరీక్షల నుంచి హిందీని బలవంతంగా విద్యార్థులపై రుద్దడం వరకూ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించడం లేదని ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు, 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే విజయభేరి మోగిస్తుందని, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.