జాతీయ వార్తలు

ఎవరు బలవంతుడో ప్రజలే తేలుస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 14: ప్రధాని నరేంద్రమోదీని పొగుడుతూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అధికార ఏఐడిఎంకె పార్టీ మండిపడింది.
రాజకీయంగా మోదీ అత్యంత బలవంతుడిగా కన్పిస్తున్నారని, అందుకే ఆయనను ఓడించడానికి అనేక పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయని, ఒక మనిషిపై పోటీకి అతమంది దండెత్తుతున్నారంటే ఆయన రాజకీయంగా బలాఢ్యుడే కదా అని రజనీ మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఏఐడిఎంకె ఖండించింది. ఆ పార్టీ నేత, మంత్రి డి.జయకుమార్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ఎవరు బలవంతుడో, ఎవరు బలహీనులో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. బలవంతుడా, బలహీనుడా అని నిర్ధారించడానికి ఎన్నికలే గోదా అని పేర్కొన్నారు. ఈ గోదాలో నెగ్గిన వాడే బలవంతుడని, దానిని నిర్ణయించేది రజనీయో, తామో కాదని ప్రజలని అన్నారు. ఏఐడిఎంకె ఎంపీలు చేసిన అభివృద్ధిని నిర్ణయిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై 2021లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. తామెంతో చేశామని ఆయా పార్టీలు నేతలు చెప్పుకోవడం సహజమేనని, కాని తుది న్యాయ నిర్ణేతలు ప్రజలని, మనం ఏమి చేశారో వారు తమ ఓటు ద్వారా తెలియజేస్తారని అన్నారు. అందరికీ వాళ్ల పిల్లలంటే ఎంతో ముద్దు, ప్రేమ అని, మా పిల్లలు చాలా మంచివారని తల్లిదండ్రులు గొప్పలు చెబుతారని, కాని వారెలాంటి వారే చెప్పేది స్కూల్ టీచర్లు, హెడ్‌మాస్టర్లని, అలాగే ప్రజలు కూడా స్కూల్‌టీచర్లు, హెడ్మాస్టర్ల లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై పోటీకి పలు పార్టీలు మహాకూటమిగా ఏర్పడటంపై ‘ఒక మనిషిపై పది మంది యుద్ధానికి వెళ్తున్నారు, వీరిలో ఎవరు బలవంతుడు? ఆ పది మందా? లేకా ఆ ఒక్క వ్యక్తా?’ అని రజనీకాంత్ ప్రశ్నించడం వైరల్‌గా మారింది.