జాతీయ వార్తలు

జాతీయ లోక్‌దల్‌లో ఆధిపత్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
===========
చండీగఢ్, నవంబర్ 14: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీలో ఆధిపత్యపోరు వీధికెక్కింది. చౌతాలా కుటుంబ పార్టీ ఐఎన్‌ఎల్‌డీ అన్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత కొడుకు అజయ్ సింగ్‌ను ఐఎన్‌ఎల్‌డీ చైర్మన్ ఓం ప్రకాష్ చౌతాల పార్టీ నుంచి బహిష్కరించారు. అజయ్‌కు పార్టీ ప్రాధమిక సభ్యత్వం రద్దుచేసినట్టు ఐఎన్‌ఎల్‌డీ వర్గాలు వెల్లడించాయి. అజయ్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ రెండ్రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తమ్ముడు అభయ్‌సింగ్ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. హర్యానా అసెంబ్లీలో అభయ్‌సింగ్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఐఎన్‌ఎల్‌డీ చైర్మన్ ఓం ప్రకాష్ చౌతాలాతోపాటు అజయ్‌సింగ్‌కూ కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా మాజీ ముఖ్యమంత్రి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజయ్ రెండువారాల పెరోల్‌పై ఉన్నారు. రెండు వారాల క్రితం అజయ్‌సింగ్ ఇద్దరు కొడుకులు దుష్యంత్, దిగ్విజయ్‌ను పార్టీ చైర్మన్ ఓం ప్రకాష్ చౌతాలా పార్టీ నుంచి బహిష్కరించారు. దుష్యంత్ హిస్సార్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. అజయ్‌సింగ్ భార్య, శాసన సభ్యురాలు నైనా చౌతాలా కూడా పార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేస్తునే ఉన్నారు. అయితే ఆమెపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా ఇద్దరు కుమారులపై ఓం ప్రకాష్ చౌతాలా వేటు వేయడం గమనార్హం. అజయ్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ అరోరా మీడియాకు వెల్లడించారు. అజయ్ సింగ్ తమ్ముడు సమక్షంలోనే అరోరా ఈ ప్రకటన చేశారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అజయ్ బహిష్కారానికి సంబంధించి ఓం ప్రకాష్ చౌతాల సంతం చేసిన కాపీని అరోరా విలేఖరులకు చూపించారు. ఈనెల 17న చండీగఢ్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశానికి హాజరవుతారని ఆయన వెల్లడించారు. మరోపక్క అదే రోజు ఐఎన్‌ఎల్‌డీ బహిష్కృత నేత అజయ్‌సింగ్ కూడా జింద్‌లో తన వర్గంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అజయ్‌సింగ్ సమావేశానికి చట్టబద్ధత లేదని, ఐఎన్‌ఎల్‌డీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఆ సమావేశం జరుగుతోందని అశక్ అరోరా పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి అనుమతిలేకుండా జరిగే ఎలాంటి సమావేశం అయినా చెల్లుబాటుకాదని అశోక్ అరోరా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ చౌతాలా సుప్రీం అని అన్నారు. కాగా అజయ్‌సింగ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయి ఐఎన్‌ఎల్‌డీని దెబ్బతీస్తున్నారని ఆయన తమ్ముడు అభయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ బహిష్కరణ వేటువేయగా అజయ్‌సింగ్ ఏ అధికారంలో 17న సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఐఎన్‌ఎల్‌డీ అధికార ప్రతినిధి ప్రవీణ్ ఆట్రే నిలదీశారు.