జాతీయ వార్తలు

బీజేపీకి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
===========
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాష్ట్రంలో అధికార బీజేపీకి బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్ 7న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో పార్టీ నాగౌర్ ఎమ్మెల్యే హబీబుర్ రహమాన్ దశాబ్ద కాలం తరువాత బుధవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జైపూర్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అజ్మీర్ ఎంపీ రఘుశర్మ, ఇతర నాయకుల సమక్షంలో రహమాన్ ఆ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన దౌసా ఎంపీ హరీశ్ చంద్ర మీనా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే రహమాన్ కూడా ఆ పార్టీలో చేరడం విశేషం. తొలుత కాంగ్రెస్ పార్టీ సభ్యుడయిన రహమాన్ 2001-2003 మధ్య కాలంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. కాని, ఈసారి బీజేపీ నాగౌర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహమాన్‌కు కాకుండా మోహన్ రామ్ చౌదరికి టికెట్ ఇచ్చింది. దీంతో రహమాన్ బీజేపీని వీడి బుధవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘నేను ఈ రోజు తిరిగి స్వంత ఇంటికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎలాంటి షరతులు పెట్టలేదు’ అని రహమాన్ ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా, ‘ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకోకుండా ఎవరు ఉంటారు?’ అని ఆయన బదులిచ్చారు. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తుది ఆమోదం తెలిపిన తరువాతే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం జరుగుతుందని ఆ పార్టీ ఎంపీ రఘుశర్మ తెలిపారు. ఇదిలా ఉండగా, హరీశ్ చంద్ర మీనా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోరి మీనా ఖండించారు. హరీశ్ చంద్ర మీనా ఒక ‘అవకాశవాది’ అని ఆయన విమర్శించారు. హరీశ్ చంద్ర మీనా కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ‘ఎలాంటి ప్రభావం ఉండబోదు. అవకాశవాది ఎవరో ప్రజలకు తెలుసు. అవకాశవాదులు ఎక్కడికయినా వెళ్లిపోవచ్చు’ అని కిరోరి మీనా పేర్కొన్నారు. అయితే, కిరోరి మీనా విమర్శలను కాంగ్రెస్ ఎంపీ రఘుశర్మ తిప్పికొట్టారు. ‘కిరోరి మీనా భార్య గోల్మాదేవి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తరువాత ఆయన బీజేపీలో చేరారు. తరువాత ఆయన రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఆయన భార్యకు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కింది. కిరోరి మీనాయే అవకాశవాదానికి చక్కని ఉదాహరణ’ అని రఘుశర్మ పేర్కొన్నారు.