జాతీయ వార్తలు

గెలుపుపైఎవరి ధీమా వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి
==========
* రెండవ విడతలో 72 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు * జోరుగా సాగుతున్న ప్రచారం
* సంకీర్ణం తప్పకపోవచ్చని అనుమానం

చత్తీస్‌గడ్‌లో రెండవ దశ పోలింగ్ ఈ నెల 20వ తేదీన జరగనుంది. మొదటి దశ పోలింగ్ దండకారణ్యంలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12వ తేదీన ముగిసింది. దాదాపు 70 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో 72 సీట్లకు రెండవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని కూటమిని ఏర్పాటు చేశారు. రెండవ విడతలో అజిత్‌జోగి వల్ల ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓటమి చెందుతుంది ? అన్యూహంగా జోగి పార్టీకి సీట్లు వచ్చి ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితి కనపడుతుందా అనే అంశంపై చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికలను విశే్లషిస్తే 2013లో కాంగ్రెస్‌కు 40.3 శాతం ఓట్లు, బీజెపీకి 41 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి అజిత్ జోగి పార్టీ దాదాపు 55 సీట్లలో పోటీచేస్తోంది. మొదటిసారిగా జోగి పార్టీ పోటీ చేయడమే గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు గెలుపుకోసం హైరానా పడుతున్నాయి. జోగి వల్ల తమ ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుందని ఈ రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతం తేడాతో ఓడిన కాంగ్రెస్ ఈ సారి ఏ విధంగానైనా చత్తీస్‌గడ్‌లో పాగా వేయాలని ఆరాటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును జోగి చీల్చుతారని బీజేపీ అంటోంది. 2013లో కర్నాటకలో యూడ్యురప్ప ఒంటరిగా పోటీ చేసి బీజేపీకి తీరని నష్టం కలిగించారు. దేశంలో ప్రాంతీయ పార్టీల వల్ల జాతీయ పార్టీల ఓటు బ్యాంకుకు గండిపడడం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లో అజిత్ జోగి పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. 2016లో అజిత్ జోగి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా కాంగ్రెస్ చత్తీస్‌గడ్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో బీఎస్పీతో పాటు సీపీఐ కూడా ఉండడం విశేషం. ఒక అంచనా ప్రకారం 90 సీట్లలో అజిత్ జోగి పార్టీ కూటమి 15 నుంచి 20 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉందని కొంత మంది పరిశీలకులు భావిస్తున్నారు. ఇదేజరిగితే, ఏ పార్టీకి కూటా పూర్తి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడుతుంది. చత్తీస్‌గడ్‌లో రెండవ విడత పోలింగ్ మైదాన ప్రాంతాల్లో జరగనుంది. ఇక్కడ బీజేపీకి బలం ఎక్కువ. కాని ఈ సారి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాకరంగా ఎన్నికలను తీసుకుంది, ప్రధాని నరేంద్రమోదీ, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుడి గాలి పర్యటనలు జరిపారు. 72 అసెంబ్లీ సీట్లలో 45 సీట్లు కచ్చితంగా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో బస్తర్‌లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. మరో మూడు రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గెలుపుపై మూడు పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ సారి చత్తీస్‌గడ్‌లో ఏ పార్టీకి మెజార్టీ రాదని, తమ మద్దతు లేకుండా బీజేపీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అజిత్ జోగి పార్టీ నేతలంటున్నారు.