జాతీయ వార్తలు

గోప్యత పాటించండి.. లీక్ చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కొన్ని అంశాలపై విచారణకు గడువు కావాలన్న సీవీసీ *19లోగా నివేదిక ఇవ్వాలని అలోక్‌వర్మకు ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 16: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అభియోగాలపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని, తమకు గడువు ఇవ్వాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కోర్టు ఆదేశం మేరకు అలోక్ వర్మపై విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో సీవీసీ నివేదిక ఇచ్చింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ సందర్భంగా వెల్లడించింది. ఈ నివేదిక చాలా కూలంకషంగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ కాపీని అభియోగాలు ఎదుర్కొంటున్న అలోక్ వర్మకు ఇవ్వాలని, ఆయన నుంచి సమాధానాలు రాబట్టాలని కోర్టు పేర్కొంది. ఈ నివేదిక పూర్తిగా గోప్యతతో కూడుకుని ఉండాలని, దీని వివరాలను బహిర్గతం చేయరాదని కోర్టు ఆదేశించింది. ఈ నివేదికలో ప్రస్తావించిన అంశాలను చదివి తన సమాధానాన్ని ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఆదేశించింది. శుక్రవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ విచారించారు. ఈ నివేదికలో అంశాలు మిశ్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రశంసించే వ్యాఖ్యలు, కొన్ని తప్పుడు నిర్ణయాలను పసిగట్టే విధంగా మిశ్రమంగా నివేదిక ఉందని కోర్టు తెలిపింది. ఈ కేసును విచారించేందుకు ఏర్పాటైన ధర్మాసనంలో జసిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ ఉన్నారు. ఈ నివేదిక వివరంగా ఉందని, నాలుగు కేటగిరీలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. కొన్ని ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని సీవీసీ పేర్కొంది. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. తనను సెలవుపై వెళ్లాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సీబీఐలో డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్‌డైరెక్టర్ రాకేష్ ఆస్తానా మధ్య వివాదాలు తలెత్తిన విషయం విదితమే. సీబీఐ విశ్వాసాన్ని పెంచాలంటే, ఈ నివేదికల్లో అంశాలు లీకు కాకుండా చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నివేదిక ప్రతిని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ కార్యాలయానికి కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నివేదికలోని అంశాలు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు వెల్లడించరాదని కోర్టు స్పష్టం చేసింది. కాగా తమ క్లైంట్ స్పెషల్ డైరెక్టర్ అస్తానా కూడా పిటిషన్ దాఖలు చేసినందు వల్ల నివేదిక ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది ముకుల్ రోహ్తగి కోరగా కోర్టు తిరస్కరించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివేదికపై తన స్పందన తెలియచేసిన వెంటనే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను పిటిషన్‌లో పేర్కొన్నందు వల్ల ఎన్‌జీవో కామన్ క్లాజ్ సంస్థ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదనికోర్టు పేర్కొంది.