జాతీయ వార్తలు

కొసోవో వీసా సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఢిల్లీలో జరుగుతున్న మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కొసోవో బాక్సర్ డొంజెటా సడికుకు ప్రాతినిధ్యం కల్పించనందున 2021లో నిర్వహించే పురుషుల వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి తాము వైదొలగుతామని ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఏఐబీఏ) భారత్‌ను హెచ్చరించింది. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 60 కేజీల విభాగంలో కొసోవో అథ్లెట్ డొంజెటా పాల్గొనాల్సి ఉంది. కానీ దక్షిణ ఈశాన్య యూరోప్‌లోని వివాదాస్పద ప్రాంతం నుంచి పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న ఆమెకు భారత ప్రభుత్వం పోటీల చివరి వరకు వీసా మంజూరు చేయలేదు. ఇదే కారణంతో గత ఏడాది గౌహతిలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో సైతం సడికు ఆడేందుకు భారత్ వీసా మంజూరుకు నిరాకరించింది. ఈ రెండు అంశాలను తీవ్రంగా పరిగణించిన ఏఐబీఏ ప్రెసిడెంట్ గఫూర్ రహిమోవ్ తీవ్రంగా స్పందిస్తూ రాజకీయ కారణాల నేపథ్యంలో ఒక బాక్సర్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని కలలుగన్న ఆశలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించాడు.