జాతీయ వార్తలు

ఒకే వర్గానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: తెలంగాణ శాసన సభకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. రేణుకాచౌదరి శుక్రవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ కురుమ, యాదవ తదితర వెనుకబడిన కులాలు, కమ్మ సామాజిక వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఒకే వర్గానికి పెద్ద పీట వేశారని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి ప్రకటించారు. తాను త్వరలోనే ఖమ్మంలో కార్యకర్తలు, నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేసుకుంటానని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న వారికి టిక్కెట్లు ఇవ్వకుండా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మెజారిటీ సీట్లు కేటాయించారని ఆమె తెలిపారు. మిగతావర్గాలను అన్యాయం చేయడమేనని రేణుకాచౌదరి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న వారు, కార్యకర్తల కోసం త్యాగాలు చేయకుండా తమ కొడుకు, కూతురు, భార్య, సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకోవటం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో టిక్కెట్ల కేటాయింపులో తనతో పాటు ఇతర స్థానిక నాయకులను సంప్రదించకపోవడం దారుణమని ఆమె వాపోయారు. కాంగ్రెస్‌కు కురుమ, గొల్ల తదితర బీసీ వర్గాల ఓట్లు అవసరం లేదా?
అలాగే కమ్మ సామాజికవర్గం ఓట్లు అవసరం లేదా? అని ఆమె నిలదీశారు. ‘నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడి నుండో డబ్బు తెచ్చి కార్యకర్తలను కాపాడుకున్నాను. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలి? ఎలా నచ్చజెప్పాలి’ అని రేణుకాచౌదరి అడిగారు. ఈ కూటమితో తమపై ఎలాంటి కిరీటాలు పెడతారని ఆమె అన్నారు. క్షేత్ర స్థాయి నాయకులు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని పొత్తులు పెట్టుకుని ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘నేను పోటీ చేయాలనుకుంటే ఎదురేలేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే శాసన సభకు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను’అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం వారికి పరిశ్రమలున్నాయి, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నారు, అలాంటి వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం ఏమిటని రేణుచాచౌదరి మండిపడ్డారు. కమ్మ వర్గం వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నిలదీశారు.