జాతీయ వార్తలు

నాగపట్నం వద్ద తీరం దాటిన ‘గజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపట్నం/చెన్నై, నవంబర్ 16: ‘గజ’ తుఫాను నాగపట్నం-వేదారణ్యం వద్ద శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటింది. దీని ప్రభావం వల్ల తమిళనాడు తీరం అల్లకల్లోలంగా మారింది. పలు ప్రాంతాల్లోకి వరద వచ్చింది. 13మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కోస్తా ప్రాంతమంతా భారీ వర్షాలు కురిశాయి. రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను తీరం దాటుతున్న సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. గజ తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. శుక్రవారం 13 మంది చనిపోయారు. పది మంది పురుషులు, ముగ్గురు మహిళలు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. కడలూరు, నాగపట్నం, రామ్‌నాథ్‌పురం, తంజావూరు, పుదుక్కొట్టాయ్, తిరువారూర్ జిల్లాల నుంచి 81,984 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 471 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. గజ తీవ్రతకు నాగపట్నం జిల్లాలోని 16వ శతాబ్దంనాటి బాసిల్లికా వేళంకినీ ఆలయం బాగా దెబ్బతింది. చర్చి పరిసరాలు, రోడ్లు, భవనం ధ్వంసమైందని నిర్వాహకులు తెలిపారు. మార్నింగ్ స్టార్ చర్చి ముందు ఏర్పాటుచేసిన 75 అడుగుల ఎత్తయిన జీసస్ విగ్రహం పాడైంది. విగ్రహం రెండు చేతులు విరిగిపోయాయి. మ్యూజియం పైకప్పు ధ్వంసమైంది.
కాగా తుఫానుకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. గాయపడ్డవారికి లక్ష నుంచి 25వేల ఆర్థిక సహాయం ఇస్తారు. సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సీఎం పళనిస్వామి వెల్లడించారు.