జాతీయ వార్తలు

శివరాజ్ ఓ శకుని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి
===========
గుణ, నవంబర్ 16: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు వాడీవేడిగా సాగుతున్నాయి. పురాణాల్లోని పాత్రలనూ ప్రసంగాల్లో చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం ఓ ఎన్నికల సభలో మాట్లాడిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలియుగ మామగా అభివర్ణించారు. చౌహాన్ మహాభారతంలోని మామ శకుని వంటివారని సింధియా విరుచుకుపడ్డారు. అలాగే సీఎం శివాజీ ఓ కంసుడు అంటూ కాంగ్రెస్ నేత వ్యంగ్యోక్తులు విసిరారు. కౌరవులకు అత్యంత విశ్వసనీయమైన మామ శకుని. అలాగే శ్రీకృష్ణుడికి కంసుకు కూడా మామ. మహా భారతంలో వీరిద్దరిదీ నెగెటీవ్(ప్రతికూల) పాత్రే. శకుని, కంసుడికి పాండువులు, కౌరవులతో బంధుత్వం ఉండేది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈనెల 28 పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నేత సింధియా ఇక్కడో ఎన్నికల సభలో మాట్లాడుతూ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 15 ఏళ్ల బీజేపీ పాలనలో అవినీతి కింద స్థాయికంటూ పాకేసిందని ఆయన విమర్శించారు. చౌహాన్ కలియుక శకుని అంటూ ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్నదాతల కడుపుకొట్టిందని, వారి విధానాలన్నీ రైతువ్యతిరేకమేనని జ్యోతిరాదిత్య విమర్శించారు. గత ఏడాది మాండసౌర్‌లో రైతు లు ఉద్యమిస్తే పంటల బీమా పేరుతో ప్రభుత్వం వంచిందని ఆయన అన్నారు. మాండసౌర్ ఉద్యమం మలో జలియన్‌వాలాబాగ్ ఊచకోత వంటిదని సింధియా పేర్కొన్నారు. పంటల బీమా సొమ్ము రైతుల అకౌంట్లలోకి వేసి అక్కడ నుంచి సీఎం మిత్రులైన వ్యాపార వేత్తల ఖాతాల్లోకి బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సొమ్ము 6000 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారం అప్పగిస్తే రైతులు, పేద ప్రజలను ఆదుకుంటుందని సింధియా హామీ ఇచ్చారు. ప్రైవేటు కంపెనీలకు ఊడిగం చేయకుండా ప్రభుత్వ సంస్థలను ప్రోత్సహిస్తామని ఆయన ప్రకటించారు. జ్యోతిరాదిత్య పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మోదీ ప్రభుత్వం డిమోనిటైజేషన్ దేశ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు.