జాతీయ వార్తలు

మోదీకి ప్రజా సంక్షేమం పట్టదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి
===========
* ఆయన ప్రేమంతా పారిశ్రామికవేత్తలపైనే * మిగిలిన వారికీ రూ. 12 లక్షల కోట్ల రుణమాఫీకి యత్నం
* మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో రాహుల్ విసుర్లు
భోపాల్, నవంబర్ 16: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రమైన విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాగర్ జిల్లాలోని డియోరీ పట్టణంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ ‘మోదీ ఎంపిక చేసుకున్న పారిశ్రామిక వేత్తలకు 3.5 లక్షల కోట్ల రూపాయల మాఫీ చేశారు. మిగిలిన పారిశ్రామిక వేత్తలకు 12 లక్షల కోట్లరూపాయల మాఫీకి తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి’అని ఆరోపించారు. డిమోనిటైజేషన్ వెనక పెద్ద కుంభకోణం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ‘రైతుల రుణ మాఫీ గురించి నేను ఎన్ని సార్లు ప్రశ్నించినా ప్రధాని నోరువిప్పరు. అదే ఆయనకు నచ్చిన పారిశ్రామికవేత్తల విషయంలో మోదీ విధానం వేరుగా ఉంటుంది‘అని కాంగ్రెస్ అధినేత విమర్శించారు. ఎంపికచేసిన పారిశ్రామికవేత్తలకు సంబంధించి 3.5లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, మిగిలిన వారికీ 12 లక్షల కోట్లరూపాయల రుణ విముక్తిచేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని మోదీపై విరుచుకుపడ్డారు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగవేసిన నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా, మెహుల్ ఛోక్సీ దేశం విడచివెళ్లిపోవడానికి కేంద్రం సహకరించిందని రాహుల్ ధ్వజమెత్తారు. వాళ్లు ఎవరూ డబ్బుల కోసం బ్యాంకుల వల్ల క్యూలు కట్టలేదని ఆయన స్పష్టం చేశారు. డిమోనిటైజేషన్ పుణ్యమాని దేశ ప్రజలు నగదు కోసం బ్యాంకుల వద్ద బారులుతీరిన నిలబడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘అంబానీ లాంటి పెద్ద మనుషులెవరూ బ్యాంకుల వద్ద క్యూలు కట్టలేదు. పెద్దనోట్ల రద్దు తరువాత సామాన్య ప్రజలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. పెద్దనోట్ల రద్దువల్ల ప్రయోజనం జరిగిందని ఆర్థిక మంత్రి అరణ్‌జైట్లీ మంగళవారం నాడొక ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులు పెరిగారని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని జైట్లీ చేసిన ప్రకటనను రాహుల్ ఎద్దేవా చేశారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న నరేంద్రమోదీ హామీ ఏమైందని కాంగ్రెస్ చీఫ్ నిలదీశారు. మేక్ ఇండియా, స్టార్టప్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం 24 గంటల్లో 450 మందికి ఉపాధి కల్పిస్తోందని, అదే చైనాలో అయితే అంతే గడువులోపల 50వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు అవినీతి గురించి మాట్లాడే మోదీ ఇప్పుడు దాని ప్రస్తావనే తేవడం లేదని రాహుల్ అన్నారు. తాను చౌకీదార్‌గా ఉంటానన్న మోదీ హామీ ఏమైందని ఆయన నిలదీశారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ నాయకత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో వైద్య రంగం, విద్యా వ్యవస్థ ధ్వంసమయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు విరుచుకుపడ్డారు. రాష్ట్రం సంపన్నులకు స్వర్గ్ధామంగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. వ్యాపం స్కామ్ ఈ శాతాబ్దంలోనే అతిపెద్ద స్కామ్‌గా రాహుల్ అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చౌహాన్ కుటుంబం గుప్పిట్లో ఉందన్న రాహుల్ ‘అవకతవకలన్నింటిలోనూ సీఎం కుటుంబం భాగస్వామ్యంగా ఉంది’అని అని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రైతుల రుణాల మాఫీ అమలుచేస్తుందని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో రుణమాఫీ అమలుచేస్తున్నతీరును ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. పది రోజుల్లో రుణమాఫీ అమలుచేయని పక్షంలో ముఖ్యమంత్రిని అప్పటికప్పుడు మార్చేస్తామని ఆయన ప్రకటించారు.
పంట పొలాల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత స్పష్టం చేశారు. నల్లధనాన్ని తెలుపుచేసుకోడానికి మోదీ డిమోనిటైజేషన్ తీసుకొచ్చారని సియోనీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ విమర్శించారు. యూపీఏ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో 35వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతల్లో ఉపాధి హామీ మంచి ఫలితాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగులు రెట్టింపయ్యారని ధ్వజమెత్తారు.