జాతీయ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: కోర్టు ఆదేశాల మేరకే పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆపలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజకీయ ప్రయోజనాల సాధన కోసం సీబీఐని ఉపయోగించుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రధాని మోదీ లేదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు లబ్ధి చేకూర్చని రీతిలో నిష్పాక్షికంగానే సీబీఐ ఈ కేసులను దర్యాప్తు చేయాలనే తాము కోరుకుంటున్నామని, తమకు న్యాయం జరగడమే ముఖ్యమని అన్నారు. శారదా చిట్‌ఫంట్, నర్మద స్టింగ్ ఆపరేషన్ కేసుల్లో పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలపై కేసులు దాఖలు కావడం, వాటిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. పోలీసు అధికారాలు కలిగినప్పటికీ శాంతి భద్రతలన్నవి రాష్ట్రాల జాబితాలోని అంశాలు కాబట్టి ఏ దర్యాప్తు చేపట్టాలన్నా సదరు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని సీబీఐ తీసుకోవాల్సి ఉంటుందని ఏచూరి తెలిపారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఏ కేసునైనా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టగలుగుతుందని, పశ్చిమ బెంగాల్‌లో జరుపుతున్న దర్యాప్తులన్నీ కోర్టు ఆదేశాలననుసరించేనని గుర్తు చేశారు.కాగా, మమతా బెనర్జీకి అనుకూలంగా కూడా సీబీఐని ఉపయోగించకూడదని ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. గతంలో మమతపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించినప్పటికీ సీబీఐ జాప్యం చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.