జాతీయ వార్తలు

రాఫెల్ అవినీతిపై నోరు విప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లపై సంధించిన ప్రశ్నలకు బదులివ్వకుండా కాంగ్రెస్ చరిత్ర, అధ్యక్షుల పేర్ల గురించి అసందర్భంగా మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. రాఫెల్ ఒప్పందంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై నోరుమెదపాలన్నారు. కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబం వెలుపల ఎఐసీసీ అధ్యక్షులుగా వేరే వారిని ఎందుకు నియమించలేదంటూ ప్రధాని మోదీ ఇటీవల ఎన్నికల ర్యాలీలో ధ్వజమెత్తిన విషయం విదితమే. దేశంలో రైతాంగ సంక్షోభం, నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంబేద్కర్, ఎల్‌బి శాస్ర్తీ, కే కామరాజ్ లాంటి మహనీయులు కాంగ్రెస్‌లో ఉన్నారని, వారి వల్ల దేశ ఔన్నత్యం పెరిగిందన్నారు. 1947 తర్వాత అచార్య కృపాలానీ, పట్ట్భాసీతారామయ్య, పురుషోత్తమ్‌దాస్ టాండన్, యుఎన్ దేబర్, సంజీవరెడ్డి, సంజీవయ్య, కామరాజ్, నిజలింగప్ప, సీ సుబ్రహ్మణియన్, జగజ్జీవన్ రామ్, శంకర్ దయాళ్ వర్మ, డీకే బారువా, బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, సీతారాం కేసరి లాంటి వారు ఉన్నత స్థాయిలో పార్టీలో పదవులునిర్వహించారన్నారు. పెద్దనోట్ల రద్దు గురించి ప్రశ్నిస్తే తప్పుకుని తిరగడమేంటన్నారు. జీఎస్‌టీ విఫలమైందన్నారు. సీబీఐలోవివాదాల వల్ల ప్రతిష్ట మసకబారిందన్నారు. ఆర్‌బీఐను నాశనం చేస్తున్నారన్నారు. మహిళలకు బయట స్వేచ్చ లేదన్నారు.