జాతీయ వార్తలు

నిజాన్ని దాచేవారే భయపడతారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: నిజాన్ని దాచేవారే సీబీఐ దర్యాప్తుకు భయపడతారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.దాడులు, దర్యాప్తుకు సంబంధించి సీబీఐకి సాధారణ అనుమతి నిరాకరించాలని ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు నిర్ణయించిన నేపథ్యంలో శనివారంనాడిక్కడ మాట్లాడిన జైట్లీ ‘అవినీతి కేసుల్లో ఏ రాష్ట్రానికీ సార్వభౌమత్వం ఉండదు’అని అన్నారు. ఓ ప్రత్యేక కేసు విషయంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ నిర్ణయం తీసుకుందని, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉండటం వల్లే దానికి సాధారణ అనుమతిని రద్దు చేసిందన్న ఓ ప్రశ్నకు జవాబిచ్చిన జైట్లీ ‘మనం సమాఖ్య వ్యవస్థలో పని చేస్తున్నాం. ఇందులో సీబీఐ కూడా భాగం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రాల్లోని కొన్ని రకాల అవినీతి కేసులను దర్యాప్తు చేయడానికే సీబీఐ ఏర్పాటయింది.. ఇప్పటికిప్పుడు ఇంతకు మించి నేనేమీ చెప్పను’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం, నారద స్టింగ్ ఆపరేషన్‌లను ప్రస్తావించిన జైట్లీ ‘సీబీఐని అనుమతించేది లేదు అని చెప్పినంత మాత్రాన ఈ కేసులు సమసిపోవు’ అని ఉద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన ఆయన ఇది రాజకీయ నిర్ణయం కాదని, నైతికపరమైనదేనని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పన్ను వసూళ్లు పెరిగాయని, అలాగే కేంద్ర, రాష్ట్రాల ఆదాయం కూడా ఇనుమడించిందని చెప్పారు. డిమానిటైజేషన్‌కు సంబంధించి ప్రధాని మోదీ, రాహుల్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.