జాతీయ వార్తలు

స్వచ్ఛ్భారత్ ఓ చుక్కాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: భారత్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. పౌరుల ఆరోగ్యవంతమైన జీవితానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తోందని కితాబునిచ్చింది. ప్రపంచదేశాలన్నీ ఈ రకమైన స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని, అందుకు భారత్ చేపట్టిన స్వచ్ఛ్భారత్ విజయమే ఉదాహరణ అని తెలిపింది. 2016-18 మధ్య ఈ పారిశుద్ధ్యంపై అవగాహన ఎంతగానో పెరిగిందని, ఇది 13 శాతానికి చేరుకుందని పేర్కొంది. ప్రతిఒక్కరికీ స్వచ్ఛమైన జీవన పరిస్థితులను అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని వెల్లడించింది. అనేక దేశాల్లో ప్రజల ఆరోగ్యానికి దోహదం చేసే స్వచ్ఛమైన పారిశుద్ధ్య పరిస్థితులు ఒక సమస్యగానే పరిగణిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. 900 మిలియన్‌ల ప్రజలకు ప్రాథమిక పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా లేవని, మరో 500 మిలియన్ల ప్రజలకు టాయిలెట్లే లేవని వెల్లడించారు. అయితే ఇటీవల కాలంలో భారత్ సహా అనేక ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల ఈ వౌలిక పారిశుద్ధ్య సౌకర్యాల లభ్యత 70 శాతానికి పైగా పెరిగిందని ఆయన వివరించారు. భారత్ చేపట్టిన స్వచ్ఛ్భారత్ వంటి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేపడితే వౌలిక పారిశుద్ధ్య సౌకర్యాలను అందుబాటులోకి తెస్తే ఈ సమస్యను గణనీయంగా అధిగమించవచ్చునని అన్నారు. ఇంత విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడితే దానిగుణాత్మక ప్రభావం కూడా ఎక్కువే ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే దీనికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు.