జాతీయ వార్తలు

కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదని, ఒక వారసత్వ రాజకీయాలు, కుటుంబ పెత్తనంతో నడుస్తున్న సంస్థని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. సంక్షేమ విధానాలు కాంగ్రెస్‌కు అవసరం లేదని, అధికార దాహం తప్ప మరొక ధ్యాస లేదని ఆయన అన్నారు. చిదంబరంతో సహా అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏదో విధంగా తమ విధేయతను గాంధీ కుటుంబం పట్ల ప్రదర్శించేందుకు పోటీపడుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌లో తన అభిప్రాయాలను తెలియచేస్తూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. గత శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ చత్తీస్‌గడ్ రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం వెలుపల నుంచి ఎంత మంది పార్టీ అధ్యక్షులయ్యారని, ఎంత మంది ప్రధానులయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో బయటి వారికి స్థానం లేదన్నారు. మోదీ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అమిత్‌షా స్పందిస్తూ, ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు సరైనవి అన్నారు. ఇందిరా కాంగ్రెస్ 1978లో ఆవిర్భవించినప్పటి నుంచి ఏళ్లతరబడి ఒకే కుటుంబానికి చెందిన వారే పార్టీ పదవుల్లో ఉన్నరన్నారు. 1978లో కాంగ్రెస్ చీలిన తర్వాత అధికారంలోకి వచ్చింది. నిజమైన కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అని ఎన్నికల సంఘం గుర్తించింది. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి మాత్రమే ఆపార్టీలో గాంధీ కుటుంబం వెలుపల నుంచి పార్టీ అధ్యక్షులయ్యారన్నారు. చివరకు సీతారాం కేసరి లాంటి పెద్ద నేతను అవమానకరమైన రీతిలో పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. సీతారాం కేసరి పూర్తి కాలం పదవిలో కొనసాగకుండా అల్లరి చేసినవారెవరు అని అమిత్‌షా ప్రశ్నించారు. సోనియాగాంధీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సీతారాం కేసరిని బయటకు పంపేందుకు నానా హంగామా చేశారన్నారు. గతంలో బాబూజగజ్జీవన్‌రాం, ఎస్ నిజలింగప్ప, కే కామరాజ్ లాంటి మహనీయులను కుటంబ రాజకీయాలతో ఎలా అవమానించారో అందరికీ తెలిసిందేనన్నారు. 1950, 1960 దశకంలో సర్దార్ వల్లభాయ్‌పటేల్, ఆచార్య కృపాలానీలను ఎలా అవమానపరిచారో ఎవరికి తెలియదన్నారు. నెహ్రూ పరిపాలనను వ్యతిరేకించి ఆచార్య కృపాలానీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి చరిత్ర మర్చిపోదన్నారు.