జాతీయ వార్తలు

ఆరు హైకోర్టులకు జడ్జీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశ వ్యాప్తంగా ఆరు హైకోర్టులకు 34 మంది న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 28 మంది న్యాయమూర్తులను అలహాబాద్ హైకోర్టులో నియమించినట్లు తెలిపింది. ఈ మేరకు గత శనివారం నియామకాలు జరిగాయని, దేశంలో 24 హైకోర్టులకు 430 మంది న్యాయమూర్తుల కొరత ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇలావుండగా తాజా నియామకాల్లో అలహాబాద్ హైకోర్టుకు 28 మంది న్యాయమూర్తులను నియమించగా, గౌహతి హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఢిల్లీ, మేఘాలయ, ఒరిస్సా, మద్రాసు (చెన్నై) హైకోర్టులకు ఒక్కో న్యాయమూర్తి వంతున నియమించారు. కొత్తగా నియమితులైన 34 మంది హైకోర్టు న్యాయమూర్తుల్లో 17 మంది న్యాయవాదులుగా పనిచేస్తున్నవారు కాగా మిగిలినవారు న్యాయాధికారులు. అలహాబాద్ హైకోర్టు కొలీజియం మొత్తం 33 మంది పేర్లను న్యాయమూర్తి పదవులకు సిఫారసు చేసింది.
అయతే ఇందులో 17 మందిని మాత్రమే అర్హులుగా సుప్రీం కోర్టు కొలీజియం నిర్థారించింది. ఇందులోనూ 15 మందిని మాత్రమే నియమించిన సుప్రీం కోర్టు మిగిలిన ఇద్దరి పేర్లను పునః పరిశీలన చేయాలని అలహాబాద్ హైకోర్టు కొలీజియంకు తిప్పి పంపడం జరిగింది.