జాతీయ వార్తలు

కేసరిని గెంటేసి.. సోనియాకు పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాసముంద్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 18: దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఎంరో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే కాక బయటివారు ఎందరో కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారన్న కాంగ్రెస్ వాదనను ప్రధాని నరేంద్ర మోదీ అపహాస్యం చేశారు. రెండో విడత ఎన్నికల ప్రచారం ఆఖరిరోజైన ఆదివారం చత్తీస్‌గడ్‌లోని మహాసముంద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీకి అధ్యక్ష పదవిని కట్టబెట్టడానికి దళిత నేత సీతరామ్ కేసరిని ఐదేళ్లు అధ్యక్షుడిగా చేయనివ్వకుండా మధ్యలోనే వెళ్లగొట్టిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరిచారా? అని ఆయన ప్రశ్నించారు. వారికి చెందిన నాలుగు తరాల వారు దేశాన్ని పాలించారని, అయితే ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరగలేదని అన్నారు. ‘దేశ ప్రజలకు దళిత నేత సీతారాం కేసరి తెలుసునని, అయితే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు పదవిని నిర్వహించకుండా మధ్యలోనే కాంఅగెస్ కార్యాలయం నుంచి మెడపట్టుకుని బయటకు గెంటేసారు.. సోనియాకి అధ్యక్ష పీఠం కట్టబెట్టడానికే వారిలా చేశారు’ అని మోదీ ఆరోపించారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తులు ఎవరైనా దేశాన్ని పాలించినా వారి రిమోట్ అంతా కాంగ్రెస్ చేతిలోనే ఉంటుందని, వారు చెప్పినట్టే వారు ఆడాలని ఆయన విమర్శించారు. వారి కుటుంబానికి చెందిన వారు కాకుండా మిగిలిన వారెవరినైనా కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రకటించగలరా? అని మోదీ సవాల్ విసిరారు. ప్రజల కర్మకొద్దీ ఆ కుటుంబానికి చెందిన నాలుగు తరాల నాయకులు దేశాన్ని పాలించారని, దానివల్ల ఆ కుటుంబానికి ప్రయోజన చేకూరింది తప్ప ప్రజలు ఏమాత్రం మేలు జరగలేదని ఆయన విమర్శించారు. అలాంటి వారు మళ్లీ అధికారం కోరుతుంటే ప్రజలు వారిని ఎలా నమ్మగలరు అని ఆయన ప్రశ్నించారు.
చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్ పది సంవత్సరాల పాటు యూపీఏ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని మోదీ చెప్పారు. పది సంవత్సరాల పాటు కేంద్రంలో కాంగ్రెస్ రిమోట్ పాలన కొనసాగిందని, వారు తమ పాలన సమయంలో ఏనాడూ చత్తీస్‌గఢ్ అభివృద్ధిది దృష్టి సారించలేదని ఆరోపించారు. చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న బస్తర్ జిల్లాలో నక్సల్స్‌పిలుపుని కాదని ప్రజలు ఈనెల 12న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కటి గుణపాఠం అని ఆయన వ్యాఖ్యానించారు. నక్సల్స్ బాంబులు, తుపాకులతో భయపెట్టినా పేద గిరిజనులు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచి పెద్దసంఖ్యలో ఓటు వేశారని ఆయన ప్రశంసించారు. అలాగే నిన్న కాశ్మీర్‌లో జరిగిన పంయితీ ఎన్నికల్లో సైతం అక్కడ ఉగ్రవాద పిలుపును మేఖాతరు చేసి ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. ఉగ్రవాదులు బంద్‌కు పిలుపునిచ్చినా లెక్కచేయకుండా రికార్డుస్థాయిలో అక్కడ 60-70 శాతం పోలింగ్ నమోదైందని ఆయన చెప్పారు. దీంతో కాశ్మీర్ సంక్షేమానికి ద్వారాలు తెరచినట్టయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్టులకు పరోక్ష సాయం చేసి దోబూచులాట ఆడిందని, ఇక వారి ఆటకలు సాగవని మోదీ హెచ్చరించారు.
చత్తీస్‌గఢ్‌లో రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఇలాంటి వాగ్దానాలు చేస్తూ ఆటలాడుతోందని విమర్శిణచారు. నాలుగు తరాల వారు పాలించిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ పేద రైతులకు ఏమి చేసిందో తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ రైతుల అవసరాలను తీర్చిందా? వారి దుర్భర పరిస్థితిని ఏమాత్రమైనా మెరుగుపర్చిందా అని ఆయన అన్నారు. ఇక ఎంతకాలమో కాంగ్రెస్ ప్రజలను మోసం చేయలేదని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ వంటి తప్పుడు వాగ్దానాలను తాము చేయమని, రైతు దర్జాగా, ధీమాగా బతికేలా తయారు చేస్తామని మోదీ చెప్పారు. 15 ఏళ్ల పాలనలో రమణసింగ్ ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తారని ప్రధాని మోదీ హామీనిచ్చారు.