జాతీయ వార్తలు

మర్రికి మొండిచెయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: తెలంగాణ శాసనసభకు పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల చివరిజాబితాను ఆదివారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసింది. సీనియర్‌నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డికి టికెట్ లభించలేదు. వెనుకబడిన తరగతుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏఐసీసీ విడుదల చేసిన ఆరుగురి జాబితాలో కోరుట్ల-జువ్వాది నరసింగరావు, నారాయణఖేడ్-సురేష్‌షెట్కర్, సికింద్రాబాద్-కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్, నారాయణపేట-వి.కృష్ణ, దేవరకద్ర-పవన్‌కుమార్ రెడ్డి, మిర్యాలగూడ-ఆర్.కృష్ణయ్యకు కేటాయించారు. ఈ చివరిజాబితాతో మొత్తం 94 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
బుజ్జగింపులు ఫలించేనా?
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి ఉన్న నాయకులను, తిరుగుబాటు నాయకులను బుజ్జగించేందుకు ఏర్పాటైన కమిటీ ఆదివారం రోజంతా శ్రమించింది. బుజ్జగింపుల కమిటీ చేసిన కసరత్తు ఏ మేరకు ఫలిస్తుందోనని పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్క్ హయత్ హోటల్‌లో ఉన్న బుజ్జగింపుల కమిటీ చైర్మన్ పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి అధ్వర్యంలోని కమిటీ ముందుకు అసంతృప్తి నాయకులను పార్టీ పిలిపించింది. ఖమ్మం సీటు ఆశించిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వచ్చి కలిసారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కమిటీతో చర్చించారు. ఇబ్రహీంపట్నం సీటు తనకే ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశించిన నాయిని రాజేందర్ తనకే సీటు ఇవ్వాలని కోరారు. జంగయ్య (మేడ్చల్), పి. కార్తీక్‌రెడ్డి (రాజేంద్రనగర్), నేరెళ్ళ శారద (కరీంనగర్), పాల్వాయి స్రవంతి (మునుగోడు), దరవు ఎల్లన్న (్ధర్మపురి), స్టేషన్ ఘన్‌పూర్, కంటోనె్మంట్ సీటు ఆశించిన విజయరామారావు, ఎం. రాజేష్, గజ్జెల కాంతం, రేగులపాటి రమ్యారావు తదితరులతో కమిటీ సభ్యులు చర్చించి, నచ్చజెప్పారు. ఎన్నికల్లో ప్రజా కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదని, మీకు సముచితమైన స్థానం కల్పించడం జరుగుతుందని వారు నచ్చజెప్పారు. కార్తీక్‌రెడ్డి మాత్రం ఏమీ మాట్లాడలేదని తెలిసింది. ఇలాఉండగా కమిటీ సభ్యుల వద్దకు మాజీ మంత్రి, జనగామ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితరులు మర్యాదపూర్వకంగా కమిటీని కలిసారు.