జాతీయ వార్తలు

సిగ్గుచేటు..అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శరణాలయాల్లో లైంగిక దాడులపై సుప్రీం సీరియస్ * బిహార్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం
న్యూఢిల్లీ, నవంబర్ 27: అనాథ శరణాలయాలు, ఆశ్రమాల్లో బాలురపై లైంగిక వేధింపులు జరగడం అమానుషమని, ఈ విషయంలో బిహార్ ప్రభుత్వ నిర్లిప్త్ధోరణిని ప్రదర్శిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తు సమంజసమని, ఈ విషయమై బుధవారం తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది.
జస్టిస్ మదన్ బీ లోకూర్‌తో కూడిన ధర్మాసనం బిహార్ ప్రభుత్వం ఈ కేసులో అనుసరించిన వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడంలో ప్రభుత్వం తాపీగా స్పందించిందన్నారు. ఇంతకీ వేధింపులకు గురైన ఈ బాలికలు ఈ దేశ పౌరులా కాదా అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ప్రభుత్వం బాధ్యులు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై ఐపీసీ 377 కింద కేసులు నమోదు చేయలేదని, పిల్లలతో అసహజ ప్రకృతివిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని కోర్టు ప్రశ్నించింది. మీ ప్రభుత్వం ఏమి చేస్తోంది ? ఈ దురాగతాలు అమానుషం. మీ ప్రభుత్వం పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలి. ఒక పిల్లవాడి పట్ల అసహజ ప్రకృతి విరుద్ధ లైంగిక దాడి జరిగితే చీమకుట్టినట్లుగా లేదా. ఇది సాధారణ విషయమేమీ కాదు. అమానవీయ ఘటన. దీనిని ఎలా భరిస్తారు. అని ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ఈ కేసు వివరాలపై అఫిడవిట్ దాఖలైనప్పుడల్లా పరిశీలించిన విషయాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఇదో విషాదం అని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆశించిన రీతిలో కేసుదర్యాప్తు చేయడం లేదు. ఇప్పటికే సీబీఐ ముజఫర్‌పుర్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేయడం మంచిది అనికోర్టు పేర్కొంది. సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణ బుధవారానికివాయిదావేసింది. బిహార్ ప్రభుత్వంతరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ కేసు దర్యాప్తులో తలెత్తిన లోపాలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. అభియోగాలపై పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు శేఖర్ నాఫడే, ఫజియా షాకిల్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసుపై స్వతంత్ర ఏజన్సీ చేత విచారణ జరిపించాలన్నారు. ఈ షెల్టర్ హోమ్స్‌లో ఉంటున్న పిల్లలపై లైంగిక దాడులు జరిగాయని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ నివేదికలో వెల్లడైందని వారు పేర్కొన్నారు. టిస్ రిపోర్టు ప్రకారం 17 అనాథశరణాలయాల్లో దారుణాలు జరుగుతన్నాయని నివేదికలో పేర్కొన్నారని కోర్టుకు చెప్పారు.