జాతీయ వార్తలు

హుందాతనం హుళక్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: తమ ప్రభుత్వ వైఫల్యాలు, జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రతి ఒక్కరూ తనకు అన్యాయం చేస్తున్నారన్న భావనను కలిగించే రీతిలో మాట్లాడుతున్న మోదీ ఆ విధంగా తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన చర్చను దిగజార్చింది ప్రధాని మోదీయేనని తెలిపింది.
ఒక దేశ ప్రధాన మంత్రి స్థాయిని, హోదాను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సూచనను మోదీ ఇప్పటికైనా పాటిస్తే బాగుంటుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి అన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో నరేంద్రమోదీకి దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పట్టంగట్టారని, కాని అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం ఆయన విస్మరించారన్నారు. పైగా ప్రతిఒక్కరూ తమకు అన్యాయం చేస్తున్నారన్న రీతిలో ‘బాధిత రాజకీయాలకు’ ఒడిగడుతున్నారని తివారి తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రచార తీరు, ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శలు చౌకబారుతనంతో కూడుకుని ఉన్నాయని అన్నారు. ఒక దేశ ప్రధాని మాట్లాడే స్థాయిలో ఆయన మాటలు లేవని తివారి తీవ్ర స్వరంతో అన్నారు. గతంలో గుజరాత్‌లోను, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లోనూ మోదీ ఐదే తరహాలో మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత 18 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తనను వెంటాడుతూనే ఉందన్నట్టుగా మోదీ చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు.
ముఖ్యంగా తన కులాన్ని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్ష కాంగ్రెస్ మాట్లాడుతోందని మోదీ అనడం కూడా చర్చ స్థాయిని దిగజార్చే ప్రయత్నమేనని అన్నారు. అయితే దేశ సమస్యలను గుర్తించి, పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానిగా తనదేనన్న వాస్తవాన్ని మోదీ విస్మరించడానికి వీలు లేదన్నారు.