జాతీయ వార్తలు

సమన్వయంతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులను పట్టుకునేందుకు ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. సీఐటీఐ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఐటీఐ గ్లోబల్ టెక్స్‌టైల్ కాంక్లేవ్-2018లో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన ఒప్పందాలను చేసుకునేందుకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ప్రజలు ముందడుగు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇటీవల పర్యటించిన ఐరోపా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల అధినేతలందరూ భారతదేశం సాధిస్తున్న అభివృద్ధి ప్రయాణాన్ని ప్రశంసించారని చెప్పారు. భారతదేశం అత్యంత వేగంతో ముందుకు సాగుతోందని వారంతా కొనియాడారని వెంకయ్య నాయుడు తెలిపారు.
ప్రపంచ ప్రజలందరూ భారతదేశం సాధిస్తున్న అభివృద్ధి పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ ఉండాలంటే జవాబుదారీతనం, వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత, వస్తువుల్లో నాణ్యత ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ముడి సరుకులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ఉత్పాదక పోటీతత్వం, నేత, స్పిన్నింగ్, ప్రోసెసింగ్, బట్టల తయారీ కేంద్రాల మూలంగా భారత దేశానికి కొంత ఎడ్జ్ ఉంటోందని వెంకయ్య నాయుడు వివరించారు. నైపుణ్య అభివృద్ధి, స్థాయి పెంపు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగం, సమర్థతతో కూడిన తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన సూచించారు. ఈ లక్ష్యాలను సాధించగలిగినప్పుడే అంతర్జాతీయ స్థాయి లో అందరితో పోటీ పడగలుగుతామని వెంక య్య సూచించారు. జౌళి రంగానికి సంబంధించి సాంప్రదాయ పని విధానాలను ఆధునిక విధానాలతో అనుసంధానం చేసే ప్రత్యేక ప్రయోజనం మనకున్నదన్నారు. అవసరమైన సాంకేతిత పరిజ్ఞానం, పెట్టుబడులు, మార్కెట్లను ఏర్పాటు చేయటం ద్వారా జౌళి పరిశ్రమను ఆధునీకరించాలని వెంకయ్య నాయుడు ప్రతిపాదించారు. సైబర్ భౌతిక విధానాల ద్వారా ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం వైపు వెళుతోంది.. ఈ పరిస్థితుల్లో మన జౌళి పరిశ్రమ కూడా ఈ రంగంలో ముందడుగు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.
జౌళి పరిశ్రమ రంగం ఐ.ఒ.టి క్లౌడ్, కృత్రిమ మేధస్సు, విస్తార సమాచారం, విశే్లషణను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.