జాతీయ వార్తలు

వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రక్షణ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వినూత్న ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలని రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ విషయమై ఆత్మావలోకనం చేసుకోవాలని ఆమె కోరారు. డీఆర్‌డీవోలో పరిశోధన, అభివృద్ధి విభాగం దేశీయ పరిజ్ఞానంతో వినూత్నమైన ఆవిష్కరణలు చేయాలన్నారు. మిషన్ రక్ష జ్ఞాన్ శక్తి కార్యక్రమంలో డీఆర్‌డీవో కీలకపాత్రవహించాలన్నారు. ఇంటెలెక్చువల్ ప్రోపర్టీ (మేథోహక్కుల) సాధనకు కృషి చేయాలన్నారు. దేశీయ పరిజ్ఞానంతో, స్వావలంభనంతో కొత్త పుంతలు తొక్కే విధంగా వ్యవహరించేందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. మంగళవారం ఇక్కడ ఆమె డీఆర్‌డీవో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి విభాగం అత్యంత సున్నికమైనదని, ఇక్కడ పరిశోధనలు నిరంతరం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ మద్దతుతో అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. నిధులను పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామన్నారు. రక్షణ రంగంకు చెందిన పరికరాలు, వస్తువుల తయారీ, నాణ్యతలో విశేషంగా కృషి చేయాలన్నారు. ఈ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. వాణిజ్య రంగంలో రక్షణ ఉత్పత్తులను తయారు చేసే దిశగా కొత్త టెక్నాలజీని అన్వయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో చైర్‌పర్సన్ జీ సతీష్ రెడ్డి మాట్లాడారు. ఈ సదస్సుకు రక్షణ రంగ శాస్తవ్రేత్తలు, అధికారులు, రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు.