జాతీయ వార్తలు

చర్చలతోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కేంద్రం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు అన్ని ఆర్థిక ఏజన్సీలు ఉమ్మడిగా కృషి చేయాలని, జటిలమైన అంశాలపై బోర్డు రూంలో చర్చించాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఎగగొట్టి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయమై ప్రభుత్వం, రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కొంత మంది బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు తీసుకుని చెల్లించకుండా ఉండడం దారుణమన్నారు. ఆర్‌బీఐ కఠినంగా వ్యవహరించే సంస్థ అని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఏజన్సీ చేస్తున్న సేవ అమూల్యమన్నారు. ఆర్థిక రంగానికి పీడించే సమస్యలపై విశే్లషణ చేయాలన్నారు. దేశ ఆర్థిక రంగానికి గాడిన పెట్టి పటిష్టం చేసేందుకు కేంద్రం, ఆర్‌బీఐ నిరంతరం చర్చించాలన్నారు. ఈ వ్యవస్థలన్నీప్రజల మంచి కోసమేనన్నారు. ఇక్కడ ఎవరు శక్తివంతమైందో, ఎవరికి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందనే దానిపై చర్చ అక్కర్లేదన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆర్‌బీఐ, కేంద్రం మధ్య వివాదం తలెత్తిందని వస్తున్న వార్తల నేపథ్యంలో వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం ఇక్కడ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ దేశ సంక్షేమం, ఆర్థిక రంగం బలోపేతం చేసేందుకు అందరూ కలిసి ఏకతాటిపైన నడవాలన్నారు. ప్రపంచంలో పెట్టుబడులు పెట్టేందుకు భారతదేశం అనువైనదన్నారు. ఈ రోజు అత్యంత వేగంగా అభివృద్ధి ఇక్కడ జరుగుతోందన్నారు. ప్రపంచదేశాలు భారత్ అభివృద్ధిని చూసి పెట్టుబడులకు ముందుకు వస్తున్నారన్నారు. దేశంలో సంస్కరణలు వేగవంతమయ్యాయన్నారు. ఈ ఫలాలు సామాన్యులకు అందాలన్నారు. ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. జీడీపీలో 3 శాతం అభివృద్ధి జౌళి పరిశ్రమ వల్ల వస్తోందన్నారు. నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం భారత్‌లో త్వరలో ప్రారంభమవుతుందన్నారు. జౌళి శాఖ మంత్రి స్మృతి జూబిన్ ఇరానీ మాట్లాడుతూ దేశంలో జౌళి పరిశ్రమాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలను వివరించారు.